Alia Bhatt: హాలీవుడ్‌లో అడుగుపెట్టిన అలియా.. ఏకంగా ఆమెతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్న సీత..

మహేశ్‌ భట్‌ వారసురాలిగా అడుగుపెట్టినా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియాభట్‌ (Alia Bhatt). వరుస విజయాలు సొంతం చేసుకుంటూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది.

Alia Bhatt: హాలీవుడ్‌లో అడుగుపెట్టిన అలియా.. ఏకంగా ఆమెతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్న సీత..
Alia Bhatt

Updated on: Mar 09, 2022 | 8:37 AM

మహేశ్‌ భట్‌ వారసురాలిగా అడుగుపెట్టినా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియాభట్‌ (Alia Bhatt). వరుస విజయాలు సొంతం చేసుకుంటూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనున్న ఈ ముద్దుగుమ్మ ఇక్కడ కూడా పాగే వేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తన తాజా చిత్రం ‘గంగూబాయి కథియావాడి’ ని హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైంది. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే అలియా భట్‌ హాలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌ (Heart of Stone) అనే పేరుతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న సినిమాలో అలియా అవకాశం దక్కించుకుంది.

జాన్వీ, మృణాల్‌ అభినందనలు..
ఈ చిత్రంలో అలియాతో పాటు ‘వండర్ వుమెన్’ నటి గాళ్ గోబట్, ప్రముఖ నటుడు జెమీ డోర్నాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా గాళ్ గోబట్ షూటింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలను కూడా షేర్ చేసింది. కాగా ఇంటర్నేషనల్‌ స్పై థ్రిల్లర్‌ తెరకెక్కుతోన్న హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌కు టామ్ హార్పర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఐశ్యర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడు అలియా కి ఆ అవకాశం దక్కించుకుంది. ఈనేపథ్యంలో జాన్వీకపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ తదితరులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ సరసన సీత పాత్రలో నటించింది అలియా. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read:Health Tips: ఈ 5 పదార్థాలతో కలిపి తేనెను తీసుకుంటున్నారా.. చాలా ప్రమాదకరం.. అవేంటో తెలుసా?

ICC Women World Cup 2022: 25 ఏళ్లనాటి రికార్డు బద్దలు.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జోడీ..

Women’s Day 2022: సాధారణ గృహిణి నుంచి కోట్ల టర్నోవర్ దాకా.. విజయనగరం జిల్లా మహిళ విజయగాథ