Brahmastra: బ్రహ్మస్త్ర యూనిట్ నయా ప్లాన్.. అలియా, రణబీర్‌కు దూరం తప్పదా?

|

Jul 08, 2022 | 3:59 PM

Brahmastra Movie Update: బ్రహ్మస్త్ర సినిమా షూటింగ్‌లోనే ప్రేమలో పడిన అలియా, రన్బీర్ కపూర్.. సినిమా రిలీజ్‌కు ముందే పెళ్లి చేసుకొని పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని కూడా ప్రకటించేశారు.

Brahmastra: బ్రహ్మస్త్ర యూనిట్ నయా ప్లాన్.. అలియా, రణబీర్‌కు దూరం తప్పదా?
Brahmastra
Follow us on

Brahmastra Movie Update: బాలీవుడ్ స్టార్ కపుల్‌ అలియా భట్(Alia Bhatt), రణబీర్ కపూర్‌(Ranbir Kapoor)కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ మధ్యే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఆ వెంటనే అమ్మానాన్నలం కాబోతున్నట్లు గుడ్ న్యూస్ ప్రకటించింది క్రేజీ కపుల్‌. అయితే ఇప్పుడు సినిమాల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలియా భట్‌, రణబీర్ కపూర్‌ కలిసి నటించిన ఫస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రేమలో పడిన ఈ జంట.. సినిమా రిలీజ్‌కు ముందే పెళ్లి చేసుకొని పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని కూడా ప్రకటించేశారు. దీంతో ఈ కపుల్ ఆఫ్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ… సినిమా ప్రమోషన్‌కి హెల్ప్ అవుతుందని సినీ జనాల అంచనాలు మారిపోయాయి.

పెళ్లి తరువాత ఈ జోడి ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. పేరెంట్స్ కాబోతున్నారన్న న్యూస్ తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. దీంతో ఈ ఎక్స్‌పెక్టేషన్సే సినిమాకు మైనస్ అవుతాయేమో అన్న టెన్షన్ యూనిట్‌లో కనిపిస్తోంది.

ప్రజెంట్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను తగ్గించే పనిలో ఉంది బ్రహ్మస్త్ర టీమ్. ముఖ్యంగా ప్రమోషన్‌ ఈవెంట్స్‌లో అలియా, రణబీర్ కలిసి కనిపిస్తే సినిమా గురించి కాకుండా పర్సనల్ విషయాలే ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయన్నది యూనిట్‌ను టెన్షన్ పెడుతున్న మెయిన్ పాయింట్‌. అందుకే ప్రమోషన్ ఈవెంట్స్‌లో ఇద్దరు కలిసి పాల్గొనకుండా షెడ్యూల్‌ రెడీ చేస్తున్నారట.

ఇవి కూడా చదవండి

ఆర్ఆర్ఆర్ మూవీతో సౌత్ ఆడియన్స్‌కు దగ్గరైన అలియాకు సౌత్ ప్రమోషన్‌ను అప్పగిస్తారన్న టాక్ వినిపిస్తోంది. నార్త్ పబ్లిసిటీ రెస్పాన్సిబులిటీ రణబీర్‌ తీసుకునేలా ఇప్పటికే ప్లాన్ రెడీ చేస్తోందట బ్రహ్మాస్త్ర టీమ్‌. భారీ ఈవెంట్స్‌లో తప్ప… మ్యాగ్జిమమ్‌ ప్రెస్‌ ఇంటరాక్షన్స్‌ను సోలోగానే ఏర్పాటు చేయాలన్నది యూనిట్ ప్లాన్. మరి ఈ స్కెచ్‌ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..