Akshay Kumar: ఆరేళ్లలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సంపాదన ఎంతో తెలుసా.. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం..
Akshay Kumar: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఏ విషయంలోనైనా ఓపెన్‌గా ఉంటారు. తాజాగా ఆయన గత ఆరు సంవత్సరాలలో ఎంత సంపాదించారో

Akshay Kumar: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఏ విషయంలోనైనా ఓపెన్‌గా ఉంటారు. తాజాగా ఆయన గత ఆరు సంవత్సరాలలో ఎంత సంపాదించారో వెల్లడించారు. చాలామంది సెలబ్రిటీలు తమ పర్సనల్ ఇన్‌కమ్ చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారు కానీ అక్షయ్ అలా కాదు ఏ విషయమైనా కరాకండిగా చెప్పేస్తూ ఉంటారు. అయితే ఆరేళ్లలో ఆయన ఎంత సంపాదించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు. పోర్బ్స్ ప్రకారం అక్షయ్ కుమార్ ఆరేండ్ల సంపాదన రూ.1,744 కోట్లు. కరోనా సంవత్సరంలో కూడా అక్షయ్ తన వాహ కొనసాగించడం విశేషం.
ఈ ఏడాది 48.5 మిలియన్లు (రూ.356.57 కోట్లు) వార్షికాదాయంగా గుర్తించింది. 2019లో 65 మిలియన్లు (రూ.459.22 కోట్లు). 2018లె 40.5 మిలియన్లు (రూ.277.06 కోట్లు), 2017లో 35.5 మిలియన్లు (రూ.231.06 కోట్లు), 2016లో 32.5 మిలియన్లు (రూ.208.42 కోట్లు) సంపాదించినట్టు పోర్బ్స్ తన కథనంలో పేర్కొంది. రెమ్యునరేషన్ విషయంతోపాటు బాక్సాపీస్ వద్ద తన సినిమాల షేర్ల అంశంలోనూ టాప్ లో ఉన్నాడు అక్షయ్‌కుమార్. అయితే గతేడాది కేవలం ఒకే ఒక్క సినిమా లక్ష్మీతో అలరించిన అక్షయ్ కుమార్ 2021లో ఏకంగా 7సినిమాలతో అలరించనున్నాడు. లాక్‌డౌన్ రిలాక్స్ చేసినప్పటి నుంచి ఖాళీ లేకుండా వరుస సినిమాలకు ఫిక్స్ అయిపోయాడు. ఓటీటీ ప్లాట్ ఫాంలలో మాత్రమే కాకుండా థియేటర్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాడు. బెల్ బాటం, సూర్యవంశీ, అత్రంగి రే, పృథ్వీ రాజ్, రక్షాబంధన్, రామ్ సేథు, బచ్చన్ పాండే తదితర సినిమాలలో నటిస్తున్నారు.