
Agent Movie: అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండడం, అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అన్నట్లు కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా సురేందర్ రెడ్డి కూడా ఏజెంట్‌ను తప్పుకున్నాడంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
దీంతో ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించారు నిర్మాత అనిల్ సుంకర. ట్విట్టర్ వేదికగా అధికారికంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాపై జరుగుతోన్న రూమర్లపై స్పందించిన అనిల్.. ‘ఏజెంట్ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే మనాలీలో ప్రారంభం కానుంది. టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నాము. అప్‌డేట్స్ కోసం అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లను మాత్రమే ఫాలో అవ్వండి. దయచేసి ఎలాంటి పుకార్లను నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ సినిమా వాయిదా పడనుంది అని జరిగిన ప్రచారానికి చెక్ పడినట్లైంది.
#AGENT schedule starting in Manali. An update abt teaser will be given shortly. Please only follow verified twitter handles for updates. Ignore all the rumours please. ???
— Anil Sunkara (@AnilSunkara1) May 16, 2022
ఇదిలా ఉంటే అఖిల్ ఏజెంట్ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ కనిపించని రీతిలో సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అఖిల్ ఈ సినిమాతో ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..