Chor Bazaar Movie: విడుదల తేదీని ప్రకటించిన ‘చోర్‌ బజార్‌’ మూవీ యూనిట్‌.. ‘బచ్చన్‌ సాబ్‌’ వచ్చేది ఆరోజే..

Chor Bazaar Movie: పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్‌ బజార్‌'. దళం, జార్జ్‌ రెడ్డి వంటి సినిమాలతో తనదైన మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు జీవన్‌ రెడ్డి ఈ సినిమాకు...

Chor Bazaar Movie: విడుదల తేదీని ప్రకటించిన చోర్‌ బజార్‌ మూవీ యూనిట్‌.. బచ్చన్‌ సాబ్‌ వచ్చేది ఆరోజే..

Edited By:

Updated on: Jun 13, 2022 | 8:28 PM

Chor Bazaar Movie: పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. దళం, జార్జ్‌ రెడ్డి వంటి సినిమాలతో తనదైన మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు జీవన్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ‘మెహబూబా’తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఆకాష్‌ తర్వత వచ్చిన ‘రొమాంటిక్‌’తో మరో పరజయాన్ని మూటగట్టుకున్నాడు. దీంతో ‘చోర్‌ బజార్‌’తో ఎలాగైన తొలి కమర్షియల్‌ విజయాన్ని అందుకోవాలనే కసితో ఉన్నాడు. దర్శకుడు జీవన్‌ రెడ్డి దీనికి అనుగుణంగానే ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి.

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ నేపథ్యంలో.. చోరికి గురైన ఓ డైమండ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో ఆకాశ్‌ ‘బచ్చన్‌ సాబ్’ పాత్రలో కనిపిస్తున్నాడు. ఆకాశ్‌కు జోడిగా గెహన సిప్పీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈనెల 24న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక తొలి రెండు చిత్రాలను వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా చేసుకొని తెరకెక్కించిన జీవన్‌ రెడ్డి తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ కమర్షియల్‌ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా జీవన్‌ రెడ్డికి ఎలాంటి ఇమేజ్‌ను అందిస్తుందో చూడాలి.

చోర్ బజార్ ట్రైలర్.. 

ఇవి కూడా చదవండి

ఇక యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు వీ.ఎస్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ సమర్పిస్తుండడం కూడా ఈ సినిమాపై బజ్‌ రావడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. జగదీష్‌ చీకటి సినిమాటోగ్రఫీగా వ్యవహరించిన ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..