‘గూఢచారి’ బాటలో ‘ఏజెంట్ ఆత్రేయ’

|

Jul 08, 2019 | 5:25 AM

‘గూఢచారి’, ‘ఏజెంట్ ఆత్రేయ’ చిత్రాలతో తెలుగులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్, డిటెక్టివ్ కథలకు ఈ సినిమాలు ఊతం అని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ తరహా కథలకు ఫుల్ డిమాండ్. ఇప్పటికే ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నట్లు హీరో అడివి శేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదే కోవలో ‘ఏజెంట్ ఆత్రేయ’ కూడా సీక్వెల్‌కు రెడీ అవుతోంది. పరిమితి బడ్జెట్‌తోనే […]

గూఢచారి బాటలో ఏజెంట్ ఆత్రేయ
Follow us on

‘గూఢచారి’, ‘ఏజెంట్ ఆత్రేయ’ చిత్రాలతో తెలుగులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. జేమ్స్ బాండ్, డిటెక్టివ్ కథలకు ఈ సినిమాలు ఊతం అని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ తరహా కథలకు ఫుల్ డిమాండ్. ఇప్పటికే ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నట్లు హీరో అడివి శేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదే కోవలో ‘ఏజెంట్ ఆత్రేయ’ కూడా సీక్వెల్‌కు రెడీ అవుతోంది. పరిమితి బడ్జెట్‌తోనే గొప్ప సక్సెస్ అందుకోవచ్చని ‘గూఢచారి’ సినిమా నిరూపించడంతో టాలీవుడ్‌లో కొత్త పంధా కథలకు మార్గం సుగమం అయింది. లేటెస్ట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ కూడా పరిమితి బడ్జెట్‌లో తెరకెక్కి అద్భుత విజయం అందుకోవడంతో పరిశ్రమ వర్గాల్లో కొత్త జోష్ వచ్చింది.

తాజాగా జరిగిన ‘ఏజెంట్ ఆత్రేయ’ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ స్వరూప్ రాజ్ మాట్లాడుతూ… ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. అంతేకాదు దీనిని ఫ్రాంచైజీగా రన్ చేస్తామని వెల్లడించాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని చాలా మంది అడిగారు. మేం ఉన్నంత కాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ రన్ చేస్తూనే ఉంటామని స్వరూప్ రాజ్ తెలిపారు. ఎప్పుడో 80, 90 దశకాల్లో బాండ్ తరహా చిత్రాలకు తెలుగునాట విపరీతమైన క్రేజు ఉంది. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత అదే తరహా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం విశేషం.