‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ రివ్యూ

| Edited By:

Jun 21, 2019 | 10:58 AM

సినిమా: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తారాగణం: నవీన్ పొలిశెట్టి, శ్రుతీ శర్మ, సుహాస్, సందీప్ రాజ్ తదితరులు దర్శకత్వం: స్వరూప్ నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా సంగీతం: మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ: సన్నీ కురపాటి యూట్యూబ్‌ నుంచి ప్రయాణం మొదలుపెట్టి‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌’లో ఓ చిన్న పాత్రలో మెరిసిన నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయమైన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. కొత్త దర్శకుడు స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డిటెక్టివ్ […]

‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ రివ్యూ
Follow us on

సినిమా: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ
తారాగణం: నవీన్ పొలిశెట్టి, శ్రుతీ శర్మ, సుహాస్, సందీప్ రాజ్ తదితరులు
దర్శకత్వం: స్వరూప్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
సంగీతం: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ: సన్నీ కురపాటి

యూట్యూబ్‌ నుంచి ప్రయాణం మొదలుపెట్టి‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌’లో ఓ చిన్న పాత్రలో మెరిసిన నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయమైన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’. కొత్త దర్శకుడు స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. డిటెక్టివ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఆ మధ్యన విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో  దీనిపై సినీ ప్రేక్షకుల దృష్టిపడింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ(నవీన్ పొలిశెట్టి)క్రైమ్ కేసులను చేధించే డిటెక్టివ్‌గా పనిచేస్తుంటాడు. ఆ క్రమంలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో హత్యాచారానికి గురైన కేసు అతడికి ఎదురుపడుతుంది. ఆ కేసును సాయి ఎలా డీల్ చేశాడు..?ఆ కేసులో ఉన్న పెద్ద వారిని సాయి ఎలా పట్టుకున్నాడు..? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:
నవీన్ పొలిశెట్టి నటన
స్క్రీన్ ప్లే
దర్శకత్వం
సస్పెన్స్

మైనస్ పాయింట్స్:
అన్ని వర్గాలను మెప్పించే సినిమా కాకపోవడం

నటీనటుల పనితీరు:
ఈ సినిమాకు హీరో నవీన్ పొలిశెట్టి పెద్ద ప్లస్. ఏజెంట్ పాత్రలో సీరియస్‌గా నటించడంతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన నటనతో సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే నడిపించాడు నవీన్. ఇక హీరోయిన్‌ శ్రుతీ శర్మకు అంత ప్రాధాన్యం లేనప్పటికీ.. తన పాత్ర మేర బాగానే మెప్పించింది. అలాగే చాయ్ బిస్కట్ ఫేమ్ సుహాస్, సందీప్‌లలో కీలక పాత్రలలో ఆకట్టుకున్నారు

విశ్లేషణ:
దర్శకుడు స్వరూప్‌కు ఇది మొదటి చిత్రమైనప్పటికీ.. తాను రాసుకున్న డిటెక్టివ్ కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించడంలో సక్సెస్ సాధించాడు. సినిమా ఆద్యంతం ప్రేక్షకుడి కూర్చొబెట్టేలా ఆయన స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. అలాగే కామెడీ కూడా మిస్ అవ్వకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి టాలీవుడ్‌కు స్వరూప్ రూపంలో మరో వైవిధ్య దర్శకుడు దొరికాడు. అలాగే మిగిలిన అన్ని విభాగాల్లోనూ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది.

చివరగా.. కొత్తదనం కోరుకునే వారికి నచ్చే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’