నాగబాబు ఎగ్జిట్.. ఆ జబర్దస్త్ కమెడియన్లకు జాక్‌పాట్..?

| Edited By:

Nov 28, 2019 | 8:03 AM

గత కొన్నేళ్లుగా ఎంతోమంది తెలుగు కమెడియన్లకు లైఫ్‌ను ఇస్తూ వస్తోన్న కామెడీ షో జబర్దస్త్‌‌లో ఇప్పుడు కీలక మార్పులు జరుగుతున్నాయి. మొదటి నుంచి ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చిన మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పేరు మోసిన కమెడియన్లు కొందరు ఈ మధ్యే దీనికి గుడ్‌బై చెప్పి.. మరో ఛానెల్‌లో షోకు వెళ్లిపోయారు. దీంతో షో నిర్వాహకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేటింగ్‌ను పడిపోకుండా చాలా కేరింగ్ తీసుకుంటోన్న నిర్వాహకులు.. ఈ […]

నాగబాబు ఎగ్జిట్.. ఆ జబర్దస్త్ కమెడియన్లకు జాక్‌పాట్..?
Follow us on

గత కొన్నేళ్లుగా ఎంతోమంది తెలుగు కమెడియన్లకు లైఫ్‌ను ఇస్తూ వస్తోన్న కామెడీ షో జబర్దస్త్‌‌లో ఇప్పుడు కీలక మార్పులు జరుగుతున్నాయి. మొదటి నుంచి ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ వచ్చిన మెగా బ్రదర్ నాగబాబుతో పాటు పేరు మోసిన కమెడియన్లు కొందరు ఈ మధ్యే దీనికి గుడ్‌బై చెప్పి.. మరో ఛానెల్‌లో షోకు వెళ్లిపోయారు. దీంతో షో నిర్వాహకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేటింగ్‌ను పడిపోకుండా చాలా కేరింగ్ తీసుకుంటోన్న నిర్వాహకులు.. ఈ షోలో పాల్గొంటున్న అందరికీ రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్ వినిపిస్తోంది.

అందులో భాగంగా జడ్జి రోజాకు భారీగా రెమ్యునరేషన్‌ పెంచినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు ఒక్కో ఎపిసోడ్‌కు రోజా రూ.3 నుంచి రూ.4లక్షలు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు అది డబుల్ అయిందని సమాచారం. ఈ లెక్కన ఈ షో ద్వారా నెలకు 30లక్షల వరకు రోజాకు అందబోతున్నట్లు టాక్. ఇక యాంకర్‌లు రష్మి, అనసూయలకు కూడా ఒక్కో ఎపిసోడ్‌కు లక్ష దాటిందని తెలుస్తోంది.

మరోవైపు టీమ్ లీడర్లలో అంతకుముందు చమ్మక్ చంద్ర అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఇక ఇప్పుడు ఆయన కూడా షో నుంచి వెళ్లిపోవడంతో.. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్‌కు రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్‌కు 5లక్షలు.. ఆదికి 4.5లక్షలు పెరిగిందని వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు అదిరే అభికి 3లక్షలు, రాకెట్ రాఘవ 3.5లక్షలు, భాస్కర్ అండ్ టీం 2లక్షలు., చలాకీ చంటికి 2లక్షలు ముట్టనుందని సమాచారం. వీరితో పాటు సునామీ సుధాకర్, ముక్కు అవినాష్, కెవ్వు కార్తీక్ కూడా లక్షల్లోనే సంపాదిస్తున్నారని టాక్. ఏది ఏమైనా వారానికి రెండు గంటల పాటు అందరినీ నవ్విస్తూ.. షో రేటింగ్‌ను పెంచుతోన్న కమెడియన్లకు ఈ రేంజ్ రెమ్యునరేషన్‌లు ఉండటంలో తప్పు లేదన్నది కొందరి అభిప్రాయం.