నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్ సినిమాగా రూపొందే ఈ చిత్రంలో నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి ని ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు. గతంలో ఆమె మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఆమె అందంతో పాటు అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఆమెకు మరోమారు ఇంద్రగంటి అవకాశం ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. దిల్ రాజు, నాని కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వినికిడి. కాగా ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఆయన నటించిన ‘జెర్సీ’ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.