Tejaswi Madivada: నన్ను కమిట్‌మెంట్‌ అడగాలంటే భయపడేవాళ్లు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తేజస్వి..

|

Aug 14, 2022 | 6:47 PM

Tejaswi Madivada: 'సీతవ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తేజస్వి మదివాడ. చేసింది చిన్న క్యారెక్టరే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం మనం, హార్ట్‌ అటాక్‌ వంటి సినిమాల్లో..

Tejaswi Madivada: నన్ను కమిట్‌మెంట్‌ అడగాలంటే భయపడేవాళ్లు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తేజస్వి..
Follow us on

Tejaswi Madivada: ‘సీతవ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తేజస్వి మదివాడ. చేసింది చిన్న క్యారెక్టరే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం మనం, హార్ట్‌ అటాక్‌ వంటి సినిమాల్లో నటించిన ఈ చిన్నది రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐస్‌ క్రీమ్‌’తో తొలిసారి హీరోయిన్‌గా మారింది. అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ పోతోన్న తేజస్వి తాజాగా కమిట్‌మెంట్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. బోల్డ్‌ కంటెంట్‌ ఉందన్న కారణంతో ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఆగస్టు 19న ఈ సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో తాజాగా తేజస్వి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

బోల్డ్‌ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. ‘కంటెంట్‌ డిమాండ్‌ చేస్తే బోల్డ్‌ అయినా కిస్‌ సీన్‌ అయినా తప్పకుండా చేస్తాను. కమిట్‌మెంట్‌లోనూ బోల్డ్‌ సన్నివేశాలు ఉంటాయి. శ్రీనాథ్‌ నాతో రొమాన్స్‌ సన్నివేశాల్లో నటించే సమయంలో చాలా ఇబ్బంది పడ్డాడు’ అని నవ్వుతూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక ఇండస్ట్రీలో తనను ఎవరూ కమిట్‌మెంట్ అడగలేదని తెలిపిన ఈ బ్యూటీ.. తనను కమిట్‌మెంట్‌ అడగాలి అంటే భయపడేవాళ్లని చెప్పుకొచ్చింది.

ఇంట్లో వాళ్లు సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమంటున్నారని, అందుకే పెళ్లి చేసుకోవడం మానేశానని నవ్వుతూ బదులిచ్చింది. మరి కమిట్‌మెంట్ సినిమా తేజస్వి కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..