Samantha: ఏమంటూ సమంత తన సోషల్ మీడియా అకౌంట్‌లో నుంచి ‘అక్కినేని’ అనే అక్షరాన్ని తొలగించిందో అప్పటి నుంచి ఈ అందాల తార పేరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సమంత, నాగచైతన్యల మధ్య ఏదో జరుగుతోంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇటు చైతన్య కానీ, అటు సమంత కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయేసరికి, ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ లవ్లీ కపుల్‌పై వార్తలు రాసేస్తోంది. ఇక ఈ అంశం ఓవైపు టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తుంటే సమంత మాత్రం చెన్నైలో జాలీగా గడుపుతోంది. తన స్నేహితులతో కలిసి హాలీడే ఎంజాయ్ చేస్తోంది.
ఇటీవలే త్రిష, కీర్తి సురేశ్, కళ్యాణ్ ప్రియదర్శన్‌లో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా సమంత సైక్లింగ్ చేస్తూ జాలీగా గడిపింది. అది కూడా జోరుగా వాన కురుస్తున్న సమయంలో సైక్లింగ్ చేయడం విశేషం. స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియోతోపాటు.. ‘బెస్ట్ ఫ్రెండ్స్‌తో వర్షంలో సైకిల్ ప్రయాణం ఎంతో మధురం’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక మొదటి రోజు 21 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేశానని చెప్పుకొచ్చిన సమంత.. 100 కిలో మీటర్లను కచ్చితంగా చేరుకుంటాను అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. దీంతో సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..
శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు.. వంశీ పైడిపల్లి.. ప్రియుడితో కలిసి తిరుమలకు లేడీ సూపర్ స్టార్..