Sai Pallavi: ‘ఏ రూపంలో, ఎక్కడ జరిగినా హింస తప్పే’.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి..

Sai Pallavi: తనదైన నటన, చలకీ మాటలతో ఆకట్టుకునే నటి సాయి పల్లవి తాజాగా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. విరాటపర్వం సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి..

Sai Pallavi: ఏ రూపంలో, ఎక్కడ జరిగినా హింస తప్పే.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి..
Sai Pallavi

Updated on: Jun 18, 2022 | 9:22 PM

Sai Pallavi: తనదైన నటన, చలకీ మాటలతో ఆకట్టుకునే నటి సాయి పల్లవి తాజాగా వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. విరాటపర్వం సినిమా విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కశ్మీర్‌ పండిట్స్‌పై జరిగిన దాడులను ఉద్దేశిస్తూ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. భజరంగ్‌దళ్‌ నాయకులు ఏకంగా సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం వెళ్లింది. అయితే సాయిపల్లవి మాత్రం ఈ వివాదం తాను తర్వాత స్పందిస్తానంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వివాదానికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది.

తన వ్యాఖ్యలపై జరుగుతోన్న కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారన్న సాయిపల్లవి, ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేనది తెలిపింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘ఇటీవల నేను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘మీరు లెఫ్ట్‌ భావజాలం ఉన్న వారికి సపోర్ట్‌ చేస్తారా.? రైట్‌ వారికా.? అనే ప్రశ్న ఎదరైంది. దీనికి చాలా స్పష్టంగా నేను తటస్థం అని సమాధానం ఇచ్చాను. ఒక వర్గానికి చెందిన వారి కంటే ముందు మనం మంచి మనుషులుగా ఉండాలని నేను నమ్ముతాను.

కశ్మీర్‌ ఫైల్స్‌ చూసిన తర్వాత నేను చాలా డిస్ట్రబ్‌ అయ్యాను. ఆనాడు జరిగిన సంఘటన వల్ల ఎంతో మందిపై ఇప్పటికీ వాటి ప్రభావం ఉంది. అలాగే కోవిడ్ సమయంలో జరిగిన దాడులు చూసి షాక్ అయ్యాను. నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే. ఏ మతంలోనైనా హింస మంచిది కాదనేది నా అభిప్రాయం. ఓ డాక్డర్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. అందరూ ఒకటేనని నేను నమ్ముతాను. ఎప్పుడూ న్యూట్రల్‌ గా మాట్లాడే నా అభిప్రాయాలు ఇలా తప్పుగా ప్రొజెక్ట్‌ అయ్యాయి. ఇంటర్వ్యూలోని చిన్న క్లిప్‌ను తీసుకొని వార్తలు రాసేశారు. గడిచిన మూడు రోజులుగా నాకు మద్ధతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..