Regina Cassandra: ఆ హోటల్‌ రూమ్‌లో అసలేం జరిగింది.. రెజీనా నుదుటిని తాకింది దయ్యమేనా.?

Regina Cassandra: 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి రెజీనా. అనతి కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిజీగా హీరోయిన్లలో ఒకరిగా మారింది...

Regina Cassandra: ఆ హోటల్‌ రూమ్‌లో అసలేం జరిగింది.. రెజీనా నుదుటిని తాకింది దయ్యమేనా.?

Updated on: Jul 06, 2022 | 7:08 PM

Regina Cassandra: ‘శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి రెజీనా. అనతి కాలంలోనే వరుస సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకున్న ఈ బ్యూటీ బిజీగా హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఓ వైపు గ్లామర్‌ పాత్రలో రాణిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెప్పిస్తోందీ బ్యూటీ. ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా మారుతూ స్పెషల్‌ సాంగ్స్‌తో పాటు, వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది రెజీనా. ఈ క్రమంలోనే తాజాగా ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ నటించి ప్రేక్షకులను భయపెట్టిందీ బ్యూటీ.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాక్‌ షోలో పాల్గొన్న రెజీనా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఓ భయంకర అనుభవాన్ని పంచుకుంది. ఈ విషయమై రెజీనా మాట్లాడుతూ.. ‘2019లో కులుమనాలీలోని ఓ హోటల్‌లో ఐ మాస్క్‌ ధరించి నిద్రపోయాను. ఆ సమయంలో నా నుదుటిపై ఉన్న వెంట్రుకలను ఎవరో పక్కకు జరిపినట్లు అనిపించింది. దీంతో అలర్ట్‌ అయ్యి.. మాస్క్‌ తీసి చూశాను. అయితే అక్కడ ఎవరూ లేరూ’ అంటూ తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది రెజీనా.

ఇక స్కూల్ టైమ్‌లోనే యాంకరింగ్ చేసేదాన్ని అని తెలిపినా రెజీనా క్లాస్‌ లీడర్‌గా ఉన్నప్పుడు అబ్బాయిలను కొట్టేదానన్ని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రెజీని కెరీర్‌ విషయానికొస్తే ఈ అందాల తార ప్రస్తుతం ‘నేనే నా’, ‘శాకినీ ఢాకినీ’ సినిమాలతో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..