Rashmika: ‘ఇంతదూరం ఎలా వచ్చానా అనిపిస్తోంది’.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారు మతులను పోగొట్టిందీ బ్యూటీ. ఇక గీత గోవిందం హిట్‌తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. అనంతరం వరుస సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేస్తూ దూసుకుపోయింఇ. 2021లో వచ్చిన పుష్ప సినిమా రష్మిక కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే...

Rashmika: ఇంతదూరం ఎలా వచ్చానా అనిపిస్తోంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
Rashmika Mandanna

Updated on: Dec 31, 2023 | 9:39 AM

రష్మిక మందన.. ఈ పేరును సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న నటిగా గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. 2016లో వచ్చి కిరిక్‌ పార్టీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైందీ చిన్నది. అనంతరం కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఈ చిన్నది 2018లో ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో కుర్రకారు మతులను పోగొట్టిందీ బ్యూటీ. ఇక గీత గోవిందం హిట్‌తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. అనంతరం వరుస సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేస్తూ దూసుకుపోయింఇ. 2021లో వచ్చిన పుష్ప సినిమా రష్మిక కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దీంతో రష్మిక ఓవర్‌నైట్‌లో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమాలో డీ గ్లామర్‌ పాత్రలో నటించినా తన నటతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా వచ్చిన యానిమల్‌ మూవీతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుందీ చిన్నది. ఇదిలా ఉంటే రష్మిక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు గడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రష్మిక ప్రయాణం శనివారంతో ఏడేళ్లు ముగిసింది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది.

రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..


ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పిన రష్మిక.. ‘వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణమంతా ఓ కలలా అనిపిస్తుంది. అసలు ఇంతదూరం ఎలా వచ్చానోనని ఆశ్చర్యం కలుగుతుంది. ఏదిఏమైనా నా కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. మంచి మనసున్న వ్యక్తుల పరిచయం..వారితో చేసిన ప్రయాణం వల్లే ఈ స్థాయికి చేరుకున్నా’ అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెంట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..