
Rakul Preet Singh: 2011లో వచ్చిన ‘కెరటం’ అనే చిన్న సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం తర్వాత ఏడాది వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిందీ చిన్నది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకొని రకుల్ వరుస సినిమాలతో దూసుకెళ్లింది. టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఓవైపు తెలుగులో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూనే మరోవైపు హిందీతోపాటు ఇతర భాషల చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసానికైనా నటీనటులు సై అంటుంటారు. అందులో బరువు పెరగడం, తగ్గడం కూడా ఒకటి. అయితే తను మాత్రం ఆ పని చేయనని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ విషయమై ఈ అందాల భామ మాట్లాడుతూ.. ‘నాకూ సినిమాలు అంటే ప్రాణం. ఎప్పుడూ ఛాలెజింగ్ పాత్రలు చేయాలని కోరుకుంటాను. వాటి కోసం ఎంతైనా కష్టపడతాను. కానీ బరువు పెరగడం, తగ్గడం మాత్రం నా వల్ల కాదు. ఎందుకంటే… అది సహజంగా జరగాల్సిన ప్రక్రియ. కావాలని బరువు పెరిగినా, తగ్గినా… శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలకి దారి తీస్తాయి. అందుకే నేను ఆ తప్పు చేయను. నా దృష్టిలో ఫిట్‌నెస్ అనేది చాలా కీలకం. ఇప్పటి వరకు లక్కీగా నన్ను ఎవరూ అలా చేయమని కోరలేదు’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే రకుల్ తాజాగా నటించిన కొండ పాలెం చిత్రంలో ఓటీటీ వేదికగా విడుదలైన మంచి టాక్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.
Also Read: WhatsApp Groups: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్.. ఇక నుంచి ఆ మెసేజ్‌లకు చెక్..!
IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్, హెడ్ కోచ్‌గా వారిద్దరే.. త్వరలోనే కీలక ప్రకటన..!