AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Rajitha : రెగ్యులర్ అంటూ పక్కనపెట్టేస్తున్నారు.. మాకు అవకాశాలు ఇవ్వండి.. టాలీవుడ్ నటి రజిత..

ఒకప్పుడు తన సహజ నటనతో, కామెడీ టైమింగ్ తో వెండితెరపై ప్రేక్షకులను అలరించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సీనియర్ యాక్టర్స్ సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అలాంటివారిలో రజిత ఒకరు. తెలుగు చలన చిత్రపరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రజిత. ఇప్పుడు మౌళి నటిస్తున్న దొంగ నా కొడుకు సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

Actress Rajitha : రెగ్యులర్ అంటూ పక్కనపెట్టేస్తున్నారు.. మాకు అవకాశాలు ఇవ్వండి.. టాలీవుడ్ నటి రజిత..
Rajitha
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2026 | 11:36 AM

Share

షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. ఇప్పుడు దొంగ నా కొడుకు అనే సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో సీనియర్ నటి రజిత భావోద్వేగ ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న తాను, ఒక మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో దొంగ నా కొడుకు అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు. “ఎన్నో మంచి హిట్ సినిమాలు చేశాను. పెద్ద పెద్ద హీరోలతో నటించాను. ఈ మధ్యకాలంలో ఒక మంచి క్యారెక్టర్ పడట్లేదే, నన్ను మర్చిపోతున్నారేమోనని బాధపడే సమయంలో నాకు ఈ ఆఫర్ వచ్చింది” అని రజిత చెప్పుకొచ్చారు. ఆఫర్ వచ్చిన తొలుత దానిని నమ్మలేదని, ఫేక్ కాల్ అనుకున్నానని రజిత అన్నారు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నిఖిల్ కాల్ చేసినప్పుడు, “నేను కాదులే” అనుకొని ఫోన్ పెట్టేసి, నటుడు అలీకి ఫోన్ చేసి అడిగితే, “అవును రజిత, స్టోరీ చాలా బాగుంది, ఇది నిజమే” అని అలీ చెప్పడంతోనే ఆఫర్‌ను స్వీకరించినట్లు ఆమె వివరించారు. ఈ సంవత్సరం తనకు వచ్చిన మొదటి ఆఫర్ ఇదేనని, ఇది తన కెరీర్‌కు మంచి కమ్‌బ్యాక్‌ అవుతుందని, ప్రేక్షకుల ఆశీస్సులు కావాలని రజిత మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించిన మౌళికి, దర్శకుడు శ్రీను కంబాల గారికి, మైత్రి మూవీ మేకర్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మౌళికి తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉందని, దొంగ నా కొడుకు టైటిల్ వినగానే అందరి మొహంలో ఒక చిరునవ్వు వస్తుందని రజిత అన్నారు. ఈ సినిమా మౌళికి కూడా సూపర్ హిట్ కావాలని ఆమె ఆకాంక్షించారు. అలీతో కలిసి ఎన్నో సినిమాలు చేశామని, మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో పూర్తిస్థాయి పాత్రలు చేయడం చాలా ఆనందంగా ఉందని రజిత పేర్కొన్నారు. తనతో పాటు నటించిన బబ్లు సెట్‌లో చాలా హిలేరియస్‌గా ఎంటర్టైన్ చేశాడని, ప్రేక్షకులు సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారని ఆమె చెప్పారు.

అలాగే అవకాశాల గురించి స్పందిస్తూ.. తమను రెగ్యులర్ అంటూ పక్కన పెట్టేస్తున్నారని.. కానీ సీనియర్ మేల్ ఆర్టిస్టులకు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అదే వయసుకున్న నటీమణులను మాత్రం రెగ్యులర్ గా కనిపించే ముఖాలంటూ పక్కన పెడుతున్నారని అన్నారు. హీరోయిన్ పాత్రలు కాదు.. కనీసం బీ కేటగిరీ పాత్రలైనా మేము చేస్తాం కదా.. ఆ అవకాశాలైనా కల్పించండి.. ఇది రిక్వెస్ట్ మాత్రమే అని అన్నారు. రజిత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Follow Us
మాకు అవకాశాలు ఇవ్వండి.. టాలీవుడ్ నటి రజిత..
మాకు అవకాశాలు ఇవ్వండి.. టాలీవుడ్ నటి రజిత..
ఎల్ నినో పతాక స్థాయికి చేరేది ఎప్పుడు అంటే..?
ఎల్ నినో పతాక స్థాయికి చేరేది ఎప్పుడు అంటే..?
మరో కొత్తరకం దోపిడీ.. డబ్బులు లేవంటే.. మొబైల్ యాప్‌లో బలవంతంగా
మరో కొత్తరకం దోపిడీ.. డబ్బులు లేవంటే.. మొబైల్ యాప్‌లో బలవంతంగా
పెరగనున్న జీతాలు.. దీపావళికి ముందే ఉద్యోగులకు శుభవార్త అందనుందా?
పెరగనున్న జీతాలు.. దీపావళికి ముందే ఉద్యోగులకు శుభవార్త అందనుందా?
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై మాజీ కోచ్ ఏమన్నారంటే
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై మాజీ కోచ్ ఏమన్నారంటే
భారీగా పతనమైన బంగారం ధరలు.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైమ్‌..!
భారీగా పతనమైన బంగారం ధరలు.. కొనాలంటే ఇదే బెస్ట్‌ టైమ్‌..!
ఐ-టెక్ వాష్‌రూమ్, షవర్,వేడి ఆహారం! రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా
ఐ-టెక్ వాష్‌రూమ్, షవర్,వేడి ఆహారం! రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పోటీగా
లక్షాధికారిని చేసే స్కీమ్‌..నెలకు రూ.6 వేలు డిపాజిట్‌ చేస్తే చాలు
లక్షాధికారిని చేసే స్కీమ్‌..నెలకు రూ.6 వేలు డిపాజిట్‌ చేస్తే చాలు
ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి.. భక్తులు తప్పక..
ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి.. భక్తులు తప్పక..
సౌదీ అరేబియాపై హౌతీల భీకర దాడులు.. భారత్ కీలక ప్రకటన..
సౌదీ అరేబియాపై హౌతీల భీకర దాడులు.. భారత్ కీలక ప్రకటన..