Actress Priyamani : తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ బెంగళూరు బ్యూటీ ప్రియమణి. వరుస సినిమాలతో బిజీగా ఉన్నసమయంలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కింది. పెళ్లితర్వాత సినిమాలను తగ్గించింది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తుంది. తమిళ్ లో దివంగత నాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి లో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో జయలలితగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తుండగా.. ఎంజీఆర్ గా అరవిందస్వామి కనిపించనున్నారు.
ఈ సినిమాతో పాటు తెలుగులో ప్రియమణి వెంకటేష్ హీరో గా నటిస్తున్న నారప్ప సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. పెళ్లితర్వాత కాస్త బొద్దుగా తయారైన ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ కోసం స్లిమ్ గా మారింది. పెళ్లితర్వాత గ్లామర్ షోకు ప్రియమణి దూరంగా ఉంటారనుకునే వారికీ షాక్ ఇస్తూ.. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు సిద్దమే అని ఈ ఫొటోస్ తో చెప్పకనే చెప్తుంది ప్రియమణి. ఇక ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం తమిళ్, తెలుగు, కన్నడ కలిపి సుమారు 6 సినిమాలవరకు ఉన్నాయని టాక్.
మరిన్ని ఇక్కడ చదవండి:
ఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్ రకుల్.. ఆ స్టార్ హీరోతో నాకు ఒప్పందం ఉంది అంటున్న బ్యూటీ..