AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో ఉపేంద్రతో ప్రేమాయణం.. గట్టిగా ఇచ్చిపడేసిన టాలీవుడ్ హీరోయిన్..

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అప్పట్లో హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. అలాగే సహయ నటిగా అలరించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో వచ్చిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

హీరో ఉపేంద్రతో ప్రేమాయణం.. గట్టిగా ఇచ్చిపడేసిన టాలీవుడ్ హీరోయిన్..
Upendra
Rajitha Chanti
|

Updated on: Sep 09, 2026 | 11:44 AM

Share

ప్రముఖ నటి ప్రేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా విడాకుల గురించిన పలు విషయాలను మొట్ట మొదటిసారిగా వెల్లడించారు. తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ కలపలేదని, తన విడాకుల గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదని ఆమె తెలిపారు. ఇదివరలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ అడగలేదని, తాను కూడా ఎవరికీ చెప్పలేదని ప్రేమ స్పష్టం చేశారు. కన్నడ సినీ పరిశ్రమలో తన అభిమాన నటుల గురించి ప్రస్తావించినప్పుడు.. శివరాజ్‌కుమార్ నుండి నటనకు సంబంధించిన ఒక కోణాన్ని నేర్చుకుంటే, విష్ణువర్ధన్ నుండి డిసిప్లిన్, నటనలోని వివిధ పార్శ్వాలను అర్థం చేసుకున్నానని చెప్పారు. చంద్రముఖి సినిమా ప్రభావం నటుల జీవితాలపై పడిందన్న వార్తలను ఆమె ఖండించారు. తన వరకు అలాంటి మూఢనమ్మకాలను నమ్మనని, ప్రతిదీ మనం ఎలా స్వీకరిస్తామనే దానిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. పాజిటివ్‌గా స్వీకరిస్తే పాజిటివ్ ఫలితాలు, నెగటివ్‌గా స్వీకరిస్తే నెగటివ్ ఫలితాలు వస్తాయని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

తన విడాకుల విషయానికి వస్తే, “నాకు నచ్చకపోతే, నేను సూటిగా నిర్ణయం తీసుకుంటాను. ఇది నా జీవితం, నా ఒకే ఒక జీవితం” అని ప్రేమ ధైర్యంగా ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు తన తల్లిదండ్రులతో చర్చించానని, వారు తనను పూర్తిగా ప్రోత్సహించారని తెలిపారు. జీవితంలో సవాళ్లు వస్తాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె మహిళలకు సందేశం ఇచ్చారు. “ప్రపంచం పెద్దది, ఒక పనిలో లీనమైతే మళ్లింపు లభిస్తుంది. ఇదే జీవితం కాదు” అంటూ ప్రేమ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. పెళ్లి మాత్రమే జీవితం కాదని, మహిళలకు సొంత జీవితం, శక్తి ఉంటుందని ఆమె నొక్కి చెప్పారు. “నేను వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లాను. మా తల్లిదండ్రులు వస్తామని చెప్పినా, నేను ఒక్కదాన్నే వెళ్లి నా పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చాను. ఆ తర్వాత నా వృత్తిపై దృష్టి సారించాను” అని ప్రేమ వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

అలాగే ఈ ఇంటర్వ్యూలో కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే తాను హీరో ఉపేంద్రతో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన రూమర్స్ ను ఆమె ఖండించారు. ఉపేంద్రతో రిలేషన్ అంటూ వచ్చిన ప్రచారం ఎలా మొదలైందో తనకు తెలియదని.. ఎవరూ తనను కానీ.. ఉపేంద్రను కానీ ఈ విషయం గురించి ప్రశ్నించలేదని అన్నారు. నిజాలు తెలియకుండా అప్పుడు ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేశారని.. ఈ రూమర్స్ గురించి ఉపేంద్ర ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఉపేంద్ర ప్రేమ..

Upendra, Prema

Upendra, Prema

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

Follow Us