Preethi Asrani: నాకంటూ కొన్ని పరిమితులున్నాయి, వాటిని దాటలేను.. ప్రీతి అస్రాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.

|

Sep 20, 2022 | 9:35 AM

Preethi Asrani: గుండెల్లో గోదావరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార ప్రీతి అస్రాని. ఈ సినిమాతో పెద్దగా ఎవరికీ తెలియపోయినా అనంతరం వచ్చిన మళ్లీ రావా సినిమాతో ఒక్కసారిగా అందరిదృష్టిని తనవైపు తిప్పుకుంది...

Preethi Asrani: నాకంటూ కొన్ని పరిమితులున్నాయి, వాటిని దాటలేను.. ప్రీతి అస్రాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.
Preethi Asrani
Follow us on

Preethi Asrani: గుండెల్లో గోదావరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార ప్రీతి అస్రాని. ఈ సినిమాతో పెద్దగా ఎవరికీ తెలియపోయినా అనంతరం వచ్చిన మళ్లీ రావా సినిమాతో ఒక్కసారిగా అందరిదృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ చిన్ననాటి పాత్రలో నటించిన ప్రీతి.. తన క్యూట్‌ లుక్స్‌, న్యాచురల్‌ యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసింది. అనంతరం పలు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందీ క్యూట్‌ గర్ల్‌. ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదలకానున్న నేపథ్యంలో తాజాగా ప్రీతి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

సినిమాల ఎంపిక విషయంలో తన మనసులో మాట బయట పెట్టిన ప్రీతి.. నటిగా తనకంటూ కొన్ని పరిమితులున్నాయని చెప్పుకొచ్చింది. ఒక పాత్రను ఎంచుకునేటప్పుడు వాటిని దాటలేనని, ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ డీసెంట్‌గా, ఫ్యామిలీ ఓరియంటెడ్‌గానే ఉన్నాయని తెలిపింది. ఇక తనకు డీసెంట్‌గా ఉండే పాత్రలో బాగా నప్పుతాయని తెలిపిన ప్రీతి అస్రాని.. నటనకు ఆస్కారమున్న.. అర్థవంతమైన పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఛాన్స్‌ వస్తే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటించాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న యశోద సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే తమిళంలో రెండు సినిమాలకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఇక అన్నపూర్ణ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు చెప్పుకొచ్చిందీ గుజరాతీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…