Connect Trailer: అర్థరాత్రి విడుదలైన నయన్‌ ‘కనెక్ట్’ ట్రైలర్‌.. ఇంటర్వెల్‌ లేని ఈ సినిమాలో మరెన్నో ప్రత్యేకతలు.

హారర్‌ మూవీస్‌తో ప్రేక్షకులకు భయపెట్టిన అతికొద్ది మంది టాలీవుడ్‌ నటీమణుల్లో నయనతార ఒకరు. నయన్‌ ఇప్పటికే పలు హారర్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైంది నయన్‌. కనెక్ట్ మూవీతో..

Connect Trailer: అర్థరాత్రి విడుదలైన నయన్‌ కనెక్ట్ ట్రైలర్‌.. ఇంటర్వెల్‌ లేని ఈ సినిమాలో మరెన్నో ప్రత్యేకతలు.
Connect Trailer

Updated on: Dec 09, 2022 | 9:24 AM

హారర్‌ మూవీస్‌తో ప్రేక్షకులకు భయపెట్టిన అతికొద్ది మంది టాలీవుడ్‌ నటీమణుల్లో నయనతార ఒకరు. నయన్‌ ఇప్పటికే పలు హారర్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైంది నయన్‌. కనెక్ట్ మూవీతో ప్రేక్షకులకు భయపెట్టనుంది నయన్‌. ‘మయూరి’, ‘గేమ్ ఓవర్’ సినిమాలు రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార స్వయంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 22న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు ఇంటర్వెల్ లేకపోవడం విశేషం. ఇక తాజాగా చిత్ర యూనిట్‌ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్‌. మొత్తం సినిమా 99 నిమిషాల రన్‌టైమ్‌ కాగా ఇంటర్వెల్ కూడా లేదు. ఇక 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌ మొదటి నుంచి చివరి వరకు టెన్షన్‌ టెన్షన్‌గా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక కథ విషయానికొస్తే కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో అంతా ఇంటికే పరిమితమవుతారు. ఇదే సమయంలో నయన తార ఆన్‌లైన్‌ మీటింగ్‌లో పాల్గొనగా.. వారికి ఎవరో తెలియని వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.? దెయ్యమే అదంతా చేస్తుందా.? అన్న ఆసక్తికర విషయాలను ట్రైలర్‌లో చూపించారు. అనుపమ్‌ ఖేర్‌ సైకియాట్రిస్ట్ పాత్రలో మెప్పించాడు. పూర్తిగా హారర్‌ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..