Mehreen Pirzada: సినీ జీవితం అంటేనే అంత.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన అందాల తార మెహరీన్‌..

Mehreen Pirzada: సినీ జీవితం రంగుల ప్రపంచం. రూ. కోట్లలో రెమ్యునరేషన్‌, లగ్జరీ లైఫ్‌, భారీ ఫాలోయింగ్‌, బిందాస్‌ లైఫ్‌.. ఇదీ సహజంగా సినిమా సెలబ్రిటీల గురించి అందరూ అనుకునేదు. సమాజంలో మెజారిటీ వ్యక్తులు ఇలాగే ఆలోచిస్తారు. అయితే ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి..

Mehreen Pirzada: సినీ జీవితం అంటేనే అంత.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన అందాల తార మెహరీన్‌..

Updated on: Mar 21, 2022 | 9:26 AM

Mehreen Pirzada: సినీ జీవితం రంగుల ప్రపంచం. రూ. కోట్లలో రెమ్యునరేషన్‌, లగ్జరీ లైఫ్‌, భారీ ఫాలోయింగ్‌, బిందాస్‌ లైఫ్‌.. ఇదీ సహజంగా సినిమా సెలబ్రిటీల గురించి అందరూ అనుకునేదు. సమాజంలో మెజారిటీ వ్యక్తులు ఇలాగే ఆలోచిస్తారు. అయితే ఎవరికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి.. దిగే వరకు లోతు తెలియదని చెబుతుంటారు పెద్దలు. ఇదే విషయాన్ని చెబుతోంది నటి మెహరీన్‌. అందరూ ఊహించినట్లు సినిమా జీవితం అద్భుతంగా ఉండదంటూ తనదైన శైలిలో ఓ పోస్ట్‌ చేసింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో మెహరీన్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట హల్చల్‌ చేస్తోంది.

ఇంతకీ మెహరీన్‌ చేసిన పోస్ట్‌ సారాంశం ఏంటో ఆమె మాటల్లోనే.. ‘సినీ తారల జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అనూహ్యంగా విజయాలు అందుతాయి.. అంతలోనే అపజయాలు ఎదురవుతాయి. ఒక్క రాత్రిలోనే జాతకాలు మారిపోతుంటాయి. షూటింగ్ కోసం ఎక్కడెక్కలో తిరుగుతుంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా షూటింగ్స్‌ చేయాల్సి ఉంటుంది. సమయానికి భోజనం, నిద్ర ఉండదు. దీంతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే మనం ఎంతగానో ప్రేమించే కుటుంబానికి, స్నేహితులకు దూరంగా గడపాల్సి వస్తుంది. ఇది చాలా బాధగా ఉంటుంది. ఇన్ని రకాల కష్టాలు ఉన్నా సినిమాను గొప్ప కళారూపంగా గౌరవిస్తాను’ అంటూ రాసుకొచ్చింది మెహరీన్‌.

Also Read: India-Australia Summit: భారత్ లో ఆస్ట్రేలియా పెట్టుబడులు.. నేడు ఇరు దేశ ప్రధానుల మధ్య మీటింగ్..

Viral Video: నిజమైన టామ్ అండ్ జెర్రీ ఫైట్‌‌ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు చూసి కడుపుబ్బా నవ్వుకోండి..!

Crypto Currency: GST పరిధిలోకి క్రిప్టో కరెన్సీలు.. ఎంత శ్లాబ్ రేటు కింద పన్ను వసూలు చేస్తారంటే..