Mehreen Pirzada: సినీ తారల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అయితే ఒకప్పుడు ఈ విషయాలు అంత సులువుగా తెలిసేవి కావు. ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే కానీ సినీ తారల విషయాలు అభిమానులకు పెద్దగా తెలిసేవి కావు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. ఏమంటూ సోషల్ మీడియా విస్తృతి పెరిగిందో సినీ తారలు ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ పెరిగింది. కేవలం తమ సినిమా విశేషాలనే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. హాలిడే, పర్సనల్ ఈవెంట్స్ ఇలా అన్నింటినీ అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అందాల తార మెహరీన్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజాగా పెళ్లి వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ బరాత్‌లో డ్యాన్స్ చేసింది. రోడ్డుపై ఉత్సాహంతో చిందులు వేసింది. పంజాబీ వెడ్డింగ్ సీన్స్ అనే క్యాప్షన్‌తో మెహరీన్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి భరాత్‌లో మాస్ స్టెప్పులతో ఒకింత ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
ఇక మెహరీన్ కెరీర్ విషయానికొస్తే ఇటీవల మంచి రోజులు వచ్చాయి, ఎఫ్3 సినిమాలతో వరుసగా రెండు విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ఫుల్ జోష్ మీదుంది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలో తెరకెక్కుతోన్న ‘స్పార్క్’ మూవీతో పాటు, కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..