Viral Video: కూతురుతో కలిసి లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

|

Dec 26, 2021 | 9:40 AM

'పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా' అని అన్నట్లే 'స్వయం వరం' సినిమాలో ఎంతో అందంగా కనిపించింది లయ. అభినయ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో టాప్‌ హీరోలతోనూ కలిసి నటించింది. ముఖ్యంగా 'ప్రేమించు' సినిమాలో అంధురాలిగా అద్భుతంగా నటించి నంది

Viral Video: కూతురుతో కలిసి లయ అదిరిపోయే స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Follow us on

‘పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా’ అని అన్నట్లే ‘స్వయం వరం’ సినిమాలో ఎంతో అందంగా కనిపించింది లయ. అభినయ పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో టాప్‌ హీరోలతోనూ కలిసి నటించింది. ముఖ్యంగా ‘ప్రేమించు’ సినిమాలో అంధురాలిగా అద్భుతంగా నటించి నంది అవార్డుతో పాటు ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే సినిమాల్లో ఎంతో క్రేజ్‌ ఉండగానే ఎన్నారైతో పెళ్లిపీటలెక్కింది. ఆతర్వాత కాలిఫోర్నియాలో సెటిలైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటుందీ అందాల తార. తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది.

కాగా క్రిస్మస్‌ వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకగా జరుపుకొంది లయ. అనంతరం సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఈ క్రమంలో తన కూతురు శ్లోకాతో కలిసి ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2010లో విడుదలైన ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది లయ. ఆతర్వాత మళ్లీ రవితేజ నటించిన ‘ అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో ఓ చిన్నపాత్రలో నటించింది. కాగా ఇదే సినిమాలో ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్‌లో లయ కూతురు శ్లోకా నటించి మెప్పించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే తను కూడా సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Ram Gopal Varma: రాజమౌళి సినిమాకు వాళ్లు మాత్రమే రావాలంటోన్న రామ్ గోపాల్ వర్మ.. ఆర్ఆర్ఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి కోసం స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..