
Krithi shetty: అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న నటీమణుల్లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజు, వారియర్ సినిమాల్లో మెప్పించింది. ఇక తాజాగా ‘మాచర్చ నియోజకవర్గంలో నటించింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది.
ఇందులో భాగంగానే కృతిశెట్టి.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమని తెలిపిన ఈ బ్యూటీ.. మనసు బాగోలేప్పుడు మాత్రం ఐస్‌క్రీమ్‌ను తెగ తింటానని చెప్పుకొచ్చింది. ఐస్‌క్రీమ్ తింటే తన మూడ్ ఇట్టే మారిపోతుందని సీక్రెట్‌ను బయటపెట్టింది. సహజంగా ఒత్తిడిలో ఉంటే చాక్లెట్లు తింటుంటారు. అయితే కృతిశెట్టి మాత్రం ఐస్‌క్రీమ్‌లను లాగించేస్తానని తెలిపింది.
ఇదిలా ఉంటే కృతిశెట్టి ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సెకండాఫ్‌లో విడుదల చేయనున్నారు. వీటితో పాటు నాగచైతన్యతో మరో సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో కూడా ఓ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..