Varun Tej Pan Indian Movie: బంపర్ ఆఫర్.. హిందీ స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్‌..

Varun Tej Pan Indian Movie: బంపర్ ఆఫర్.. హిందీ స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్‌..

Anil kumar poka

|

Updated on: Jul 31, 2022 | 6:26 PM

రాజమౌళి వేసిన ఒక్క అడుగుతో.. టాలీవుడ్ సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలుగా మారిపోతున్నాయి. దాంతో పాటు.. మన హీరోలందరూ గ్లోబల్ స్టార్లు గా మారిపోతున్నారు.


రాజమౌళి వేసిన ఒక్క అడుగుతో.. టాలీవుడ్ సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలుగా మారిపోతున్నాయి. దాంతో పాటు.. మన హీరోలందరూ గ్లోబల్ స్టార్లు గా మారిపోతున్నారు. ఇక ఇప్పటికే ఈ లిస్టులో ప్రభాస్ , తారక్, చెర్రీ చేరిపోగా.. తాజాగా మరో హీరో మెగా ఫ్రిన్స్ వరుణ్ తేజ్‌ కూడా పాన్ ఇండియా బాట పట్టుకున్నారు. తన తోటి హీరోలు.. నిఖిల్ మాదిరిగానే తన నెక్ట్స్ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకోసం ఏకంగా ఓ హిందీ డైరెక్టర్ తో జత కట్టనున్నారు.ఇక F3 సినిమాతో ఇప్పటికే లాఫబుల్ హిట్‌ కొట్టిన వరుణ్ తేజ్‌.. తాజాగా ప్రవీణ్ సత్తార్ మూవీ చేస్తున్నారు. యక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత.. ఓ హిందీ స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోగా నటించబోతున్నారు.ఇక ఇందుకోసం ఇప్పటికే సోనీ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. స్టోరీ కూడా లాక్‌ అయిందని.. సినిమా స్టార్ట్ అవడమే తరువాయనే గుస గుస కూడా బీ టౌన్‌లో బజ్‌ చేస్తోంది. అయితే ఇవన్నీ నిజమని తేలాలంటే.. మరి కొంత కాలం.. వెయిట్‌ చేయాల్సిందే!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Jul 31, 2022 06:26 PM