
సీనియర్ హీరోయిన్ రాధ కుమార్తె హీరోయిన్ కార్తీక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రోహిత్ మీనన్‌తో కలిసి నవంబర్ 19న ఏడడుగులు వేశారు కార్తీక. కేరళలోని త్రివేండ్రంలో జరిగిన ఈ వివాహనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. కార్తీక, రోహిత్ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అలనాటి నటీనటులు. మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి, మేనక, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ వీరి వేడుకలో సందడి చేశారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా తన అందమైన పెళ్లి వీడియోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ఈ మ్యాజికల్ వీక్ గురించి చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు.. పెళ్లి వారంలో ఎంతో ప్రేమను అందుకున్నాము అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం కార్తీక షేర్ చేసిన పెళ్లి వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో కార్తీక, రోహిత్ మీనన్ ఎంతో సంతోషంగా కనిపించగా.. చిరంజీవి, రాధిక, సుహాసిని, రాధ సరదాగా ఉండడం కనిపించింది. పెళ్లి వేడుకతోపాటు సంగీత్, రిసెప్షన్ వీడియోస్ సైతం పంచుకుంది కార్తీక. 17 ఏళ్లకే కథానాయికగా తెరంగేట్రం చేసింది కార్తీక. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.
తెలుగులో జోష్ సినిమాతో పరిచయమైంది. అక్కినేని నాగచైతన్య నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయిన కార్తీక, అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తమిళంలో జీవా నటించిన రంగం సినిమాతో హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, దమ్ము చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంది. కొన్నాళ్లుగా బిజినెస్ రంగంలో బిజీగా ఉన్న కార్తీక.. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ మీనన్ ను పెళ్లి చేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.