Hebah Patel: కుమారి.. నీ అసలు వయసెంతా.? అభిమాని ప్రశ్నకు హెబ్బా ఇచ్చి సమాధానం ఏంటో తెలుసా.?

|

Mar 21, 2022 | 7:51 AM

Hebah Patel: 'కుమారి 21ఎఫ్‌' (Kumari 21F) సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌. తొలి సినిమాతోనే తన గ్లామర్‌, నటతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. ఇక ఈ సినిమా విజయంలోనూ హెబ్బా కీ రోల్‌ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు...

Hebah Patel: కుమారి.. నీ అసలు వయసెంతా.? అభిమాని ప్రశ్నకు హెబ్బా ఇచ్చి సమాధానం ఏంటో తెలుసా.?
Hebah Patel
Follow us on

Hebah Patel: ‘కుమారి 21ఎఫ్‌’ (Kumari 21F) సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌. తొలి సినిమాతోనే తన గ్లామర్‌, నటతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. ఇక ఈ సినిమా విజయంలోనూ హెబ్బా కీ రోల్‌ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి చిత్రమే భారీ విజయం అందుకోవడంతో ఈ అమ్మడుకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఆఫర్లు అయితే వచ్చాయి కానీ మరో కమర్షియల్‌ విజయాన్ని అందుకోలేక పోయింది హెబ్బా. తాజాగా రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘రెడ్‌’ చిత్రంలో ఐటెం సాంగ్‌తో అలరించిన ఈ చిన్నది మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇదే జోష్‌లో వరుసగా మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉండే ఈ అమ్మడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మీ వయసు ఎంత అని అడిగి ఓ అభిమాని ప్రశ్నకు బదులిచ్చిన హెబ్బా.. ‘నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని’ తన అసలు వయసు ఎంతో చెప్పకుండా మాట దాటేసింది.

ఇక మీ అందానికి రహస్యమేంటని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. ‘అది పెత్త సీక్రెట్‌. బయట పెట్టొద్దు అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు. దేవుడు ఇచ్చింది కొంతయితే.. డాక్టర్ల కృషి మరికొంత అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్ చేసింది. దీంతో హెబ్బా తన అందం కోసం ఏమైనా సర్జరీ చేయించుకుందా అన్న చర్చ మొదలైంది. ఇక పెళ్లి తన చేతిలో లేదని విధికే ఆ బాధ్యతను వదిలేస్తున్నా అంటూ పెళ్లి విషయాన్ని దాటేసిందీ బ్యూటీ.

Also Read: Crypto Currency: GST పరిధిలోకి క్రిప్టో కరెన్సీలు.. ఎంత శ్లాబ్ రేటు కింద పన్ను వసూలు చేస్తారంటే..

Financial Crisis: అక్కడ పెట్రోల్‌ రూ.283.. కిలో చికెన్‌ ధర రూ.1000, కోడిగుడ్డు ధర రూ.35