Cardiac Arrest: ‘జీర్ణ సమస్యలకు గుండెతో లింకు’.. గుండెపోటుతో నిద్రలోనే ప్రముఖ నటుడు మృతి!

|

Sep 12, 2024 | 12:24 PM

టీవీ నటుడు వికాస్ సేథి కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు కనిపించిన కొన్ని లక్షణాలను బట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే అతడు బతికే వాడని వైద్యులు చెబుతున్నారు. అవును.. వికాస్‌ మరణానికి ముందు వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డాడు. కానీ ఆసుపత్రికి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో కుటుంబ సభ్యులే వైద్యుడిని ఇంటికి పిలిపించారు. కానీ..

Cardiac Arrest: జీర్ణ సమస్యలకు గుండెతో లింకు.. గుండెపోటుతో నిద్రలోనే ప్రముఖ నటుడు మృతి!
TV actor Vikas Sethi’s sudden death
Follow us on

టీవీ నటుడు వికాస్ సేథి కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి ముందు కనిపించిన కొన్ని లక్షణాలను బట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే అతడు బతికే వాడని వైద్యులు చెబుతున్నారు. అవును.. వికాస్‌ మరణానికి ముందు వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డాడు. కానీ ఆసుపత్రికి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో కుటుంబ సభ్యులే వైద్యుడిని ఇంటికి పిలిపించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వికాస్‌ మరణానంతరం ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 6 గంటలకు వికాస్‌ను నిద్రలేపేందుకు వెళ్లాను. కానీ ఎంతకూ లేవలేదు. గుండె ఆగిపోవడంతో నిద్రలోనే మరణించినట్లు డాక్టర్ తెలిపినట్లు ఆమె చెప్పారు.

నిజానికి, కార్డియాక్ అరెస్ట్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే ముందస్తు హెచ్చరిక సంకేతాలను బట్టి అప్రమత్తం అవ్వాలని వోక్‌హార్డ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ రామ్ అంటున్నారు. వికారం, వాంతులు, ఎక్కువ కాలం పాటు విరేచనాలు ఉంటే గుండె సరిగ్గా పనిచేయడం లేదని హెచ్చరిక. ఇవి కొన్ని సార్లు జీర్ణశయాంతర సమస్యల కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కార్డియాక్‌ అరెస్ట్‌కి ముందు కనిపించే లక్షణాలలో ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, అసౌకర్యం, చెమట, అలసట, ఊపిరాడకుండా పోవడం, ఆకస్మికంగా కుప్పకూలడం, స్పృహ కోల్పోవడం వంటివి కనిపిస్తాయని డాక్టర్ రామ్ తెలిపారు.

గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) సాధారణ లక్షణం ఛాతీ నొప్పి. అయితే గుండెపోటు వచ్చే 8-33 శాతం కేసుల్లో ఛాతీ నొప్పి ఉండకపోవచ్చు. నటుడు వికాస్ విషయంలో కూడా ఇదే జరిగింది. వికారం, వాంతులు, విరేచనాల, గ్యాస్ట్రోఎంటెరిటిస్ లేదా యాసిడ్ పెప్టిక్ వ్యాధి వంటి లక్షణాలు కార్డియాక్ అరెస్ట్‌తో సంబంధం ఉంటాయి. ఈ లక్షణాలు మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుడి కరోనరీ ఆర్టరీలో సమస్య ఏర్పడి రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోతుంది. వీటివల్లనే వికాస్‌ గుండెపోటుకు గురై నిద్రలోనే మరణించాడు. ఈ లక్షణాలు కొన్ని గంటల పాటు కొనసాగితే, తగినంత విశ్రాంతి తీసుకున్నా ఫలితం ఉండదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి, చికిత్స తీసుకోవాలని డాక్టర్ రామ్ చెప్పారు. ఛాతీ నొప్పి లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో గుండెపోటు నిర్ధారణ ఆలస్యం అవుతుందని డాక్టర్‌ రామ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం చేసేవారిలో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె వైఫల్యంలో జీర్ణ సమస్యలు కూడా ప్రభావం చూపుతాయి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలు, పాథోఫిజియోలాజికల్ ప్రాముఖ్యతను గుర్తించడం ముఖ్యం. సందేహనివృతి కోసం వెంటనే ECG, రక్త పరీక్ష చేసినా గుండెపోటు నిర్ధారించవచ్చు. గుండెపోటును సకాలంలో గుర్తిస్తే, చికిత్స చేసి ప్రాణాలను కాపాడవచ్చని’ డాక్టర్ కుమార్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.