Varun Sandesh: ‘చాలా ట్రోల్స్‌ వచ్చాయి కానీ’.. కొత్త లుక్‌పై స్పందించిన వరుణ్‌..

|

Jul 31, 2024 | 6:56 AM

ఈ సినిమా విజయంతో వరుణ్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇలా వచ్చిన కొత్త బంగారం లోకం సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్‌ చేసిన పలు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా 'విరాజి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు...

Varun Sandesh: చాలా ట్రోల్స్‌ వచ్చాయి కానీ.. కొత్త లుక్‌పై స్పందించిన వరుణ్‌..
Varun Sandesh
Follow us on

హ్యాపీడేస్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు యంగ్ హీరో వరుణ్‌ సందేశ్‌. ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు. అప్పట్లో యువత ఈ పాత్రకు చాలా అట్రాక్ట్ అయ్యారు. ఒకరకంగా ఈ సినిమాలో అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉన్నా వరుణ్‌ పాత్రకు మాత్రం దర్శకుడు శేఖర్‌ కమ్ముల కాస్త ఎక్కవ ప్రాయారిటీ ఇచ్చారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమా విజయంతో వరుణ్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇలా వచ్చిన కొత్త బంగారం లోకం సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్‌ చేసిన పలు సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘విరాజి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సస్పెన్స్‌, థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌ ఎక్కడం ఖాయమని వరుణ్‌ ఆశతో ఉన్నాడు.

ఇదిలా ఉంటే వరుణ్‌ ఈ మధ్య వెరైటీ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. సినిమా కోసం మార్చుుకున్న హెయిర్‌ స్టైల్‌తోనే బయట కూడా కనిపిస్తున్నాడు. దీంతో వరుణ్‌ లుక్‌పై ఆసక్తి నెలకొంది. విరాజి మూవీలో వరుణ్‌ యాండీ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసమే తన పూర్తి లుక్‌ను మార్చేశాడు. అయితే వరుణ్‌ లుక్‌పై ట్రోలింగ్ కూడా అవుతోంది. ఇదే విషయమై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు షేర్ చేసుకున్నాడు.

ఈ విషయమై వరుణ్‌ మాట్లాడుతూ.. ‘నా లుక్‌పై వచ్చిన ట్రోల్స్‌ గురించి నా భార్య చెప్పింది. ఆ విషయంలో తను బాధపడింది. కానీ, నేను ఆ విమర్శలను పట్టించుకోను. సినిమా కోసమే కదా నేను చేసిందనుకున్నా. కథ చెప్పే సమయంలోనే దర్శకుడు హర్ష.. హీరో హెయిర్‌ ఓ వైపు బ్లూ కలర్‌, మరోవైపు ఎల్లో కలర్‌లో ఉంటుందని చెప్పారు. కథ కూడా సందేశాత్మకంగా, ఆసక్తిగా అనిపించడంతో ఓకే చెప్పా. స్టోరీ చెప్పడమే కాదు ఏ పాత్ర తీరు ఎలాంటిదో ఆయనే యాక్ట్‌ చేసి చూపించారు. హీరోయిజాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు. చాలాకాలం తర్వాత మంచి సినిమాలో నటించానని నమ్మకంగా చెబుతున్నా’ అని ధీమా వ్యక్తం చేశాడు వరుణ్‌.

ఇక గతంలో తాను నటించిన.. చందు, బాలు లాంటి పాత్రల్లానే యాండీ పాత్ర కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని వరుణ్‌ నమ్మకంతో ఉన్నారు. తన గత సినిమాలు ఫ్లాప్‌ అయినా నిర్మాత మహేంద్ర నాథ్‌ నమ్మి అవకాశం ఇచ్చాడన్న వరుణ్‌.. తాను ప్రతీ పాత్రకూ న్యాయం చేస్తాని. కానీ, సినిమాలు ఎందుకు ఫ్లాప్‌ అవుతాయో తెలియదు. అది తెలిస్తే అందరం హిట్‌ చిత్రాలే చేస్తాం కదా అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్‌ తేజ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..