Tanikella Bharani : ఫెయిల్యూర్ అయిన ప్రేమ చాలా బాగుంటుంది.. తనికెళ్ల భరణి చెప్పిన ఈ మాటలు వింటే ఫిదా కావాల్సిందే..
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో వందలాది చిత్రాల్లో నటించి నటుడిగా తనదైన ముద్ర వేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన జీవితంలోని ప్రేమ, కవిత్వం, మధ్యతరగతి మనస్తత్వం, సినిమా ఆశయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రేమ పట్ల తనకున్న ప్రత్యేక ఆలోచనను వివరిస్తూ, ఫలించని ప్రేమే చితి మీద కూడా పరిమళిస్తుందని, అదే నిజమైన ప్రేమ అని అన్నారు. కవిత్వం ద్వారానే ప్రేమ పుట్టిందని, అది తన జీవితాన్ని ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.

తనికెళ్ళ భరణి నటుడిగానే కాదు.. రచయితగానూ సుపరిచితమే. ఎన్నో చిత్రాలకు కథలను, మాటలు అందించారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనయ తన జీవితంలోని ప్రేమ, కవిత్వం, మధ్యతరగతి జీవన తత్వం, సినిమా ఆశయాలపై తన ప్రత్యేక అభిప్రాయాలను పంచుకున్నారు. కవిత్వం పట్ల తనకున్న ఆసక్తి కాలేజీలో అమ్మాయిని చూసి రాలేదని, అమ్మాయికే తన కవిత్వం పట్ల ఆసక్తి కలిగిందని వెల్లడించారు. తన కవిత్వాన్ని ప్రేమించి, ఆ తర్వాత తనను ప్రేమించిన అమ్మాయి తనకు సిగరెట్లు, మిఠాయిలు కొనిపెట్టిందని గుర్తు చేసుకున్నారు. ప్రేమ పట్ల తనికెళ్ళ భరణి దృక్పథం చాలా ప్రత్యేకమైనదని అన్నారు. “ప్రేమించడం ఎప్పుడూ తప్పు కాదని, ప్రేమ అనేది లేకపోవడం మాత్రమే తప్పవుతుందని” ఆయన అన్నారు. ప్రేమించడం అనేది ఒక విశ్వవ్యాప్త అంశమని, ఒక అబ్బాయి పట్ల అమ్మాయికి, అమ్మాయి పట్ల అబ్బాయికి ఆ దశలో ఆకర్షణ కలగడం సత్యం, అవసరం, నిజం అని వివరించారు. జీవితం పట్ల సదవగాహన కలగడానికి ప్రేమ దోహదపడుతుందని పేర్కొన్నారు. తనదైన శైలిలో ప్రేమను నిర్వచిస్తూ, “ఫెయిల్యూర్ అయిన ప్రేమే ప్రేమ. ఫలించిన ప్రేమ శోభనం గదిలో అంతమైతే, ఫలించని ప్రేమ చితి మీద కూడా పరిమళిస్తూనే ఉంటుంది” అని తెలిపారు. అందుకోకపోవడంలో ఉండే మజానే జీవితమని, అందుకే మధ్యతరగతి జీవితం తనకు ఇష్టమని భరణి అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
మధ్యతరగతి జీవితంపై తనకున్న అభిమానాన్ని ప్రస్ఫుటం చేస్తూ, “I want to be a middle-class fellow, I am a middle-class fellow, I will be a middle-class fellow” అని చెప్పారు. అందులో ఒక సౌందర్యం, ఆనందం ఉన్నాయని అన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్‌కు వెళ్ళినప్పుడు, అది తనకు సరిపడని ప్రదేశం అనే భావన కలుగుతుందని, కానీ పాక హోటల్లో వేడి వేడి ఇడ్లీలు తినడం తనకు అత్యంత ఇష్టమని తన మనసులోని మాటను బయటపెట్టారు. తన సినిమా ఆశయాల గురించి మాట్లాడుతూ, తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావాలనేది తన జీవిత ఆశయమని తెలిపారు. ప్రస్తుతం తాను చిన్న సినిమాలు చేస్తున్నానని, వచ్చే ఏడాది ఒక పెద్ద సినిమాను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే లక్ష్యంతో తెరకెక్కించాలని ప్రణాళికలు రచిస్తున్నానని వెల్లడించారు. తెలుగు సినిమా సత్తా, మేధావుల ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదనే బెంగ తనకు ఉందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
నటుడిగా తన అనుభవాలను వివరిస్తూ, ప్రేక్షకులు తనను తెరపై చూసినంత సేపు ఆనందం పొందుతారని, అయితే అసహ్యం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. మాతృదేవోభవ చిత్రంలో తాను పోషించిన నెగెటివ్ పాత్ర గురించి చెబుతూ, నాజర్‌ను చంపేసిన తర్వాత, ఇంటి ముందు కూరలు అమ్మే అవ్వ తనను “అంత అన్యాయమా, అట్లా చంపుతారా?” అని అడిగిందని, అది కేవలం నటన అని వివరించినా ఆమెకు అర్థం కాలేదని గుర్తుచేసుకున్నారు. అతడు సినిమాలో తనది రెండు మూడు సీన్ల పాత్రే అయినా విపరీతంగా పండిందని, అలాగే ఆమె సినిమాలో బావ పాత్రకు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
