Mirchi Villain About His Divorce: తనకు 23 ఏళ్ల వయసులోనే పెద్దలు పెళ్లి చేశారని .. కాలక్రమంలో తమ ఇద్దరి భావాలు అభిరుచులు కలవకపోవడంతో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని హ్యాండ్ సమ్ మిర్చి మూవీ విలన్ సంపత్ రాజు చెప్పాడు. తన పెళ్లి.. విడాకుల గురించి ప్రపంచానికి వెల్లడించాడు.
అయితే సంపత్ రాజ్ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు తమిళ నటి శరణ్యను. దర్శకుడు ఎ.బి.రాజ్ కుమార్తె అయిన శరణ్యకు 19 ఏళ్ల వయసులో సంపత్‌తో వివాహం జరిగింది. అప్పటికి సంపత్ వయసు 23 ఏళ్లు. పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే, కుమార్తె పుట్టిన కొన్నేళ్ళకే వీరు విడాకులు తీసుకున్నారు. తమ ఆలోచనలు పరస్పర విరుద్ధమని.. ఇలా సాగితే.. మనస్పర్థలు ఏర్పడతాయని తాము విడాకులు తీసుకున్నామని చెప్పారు. అయితే కూతురిని తానే ఉంచుకున్నానని.. సినిమాలతో బిజీ అవ్వడంతో కుమార్తెను బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించానని.. తనకు తెలియకుండానే కూతురు పెద్దదైపోయిందని అన్నారు.
విడాకులు తీసుకున్న తర్వాత ఓ వైపు సినిమాల్లో బిజీ అవ్వడం.. మరోవైపు కూతురు భాద్యత తనను రెండో పెళ్లి గురించి ఆలోచించనివ్వలేదని తెలిపారు. తమిళంలో సుమారు 50 సినిమాలు నటించిన అనంతరంసంపత్ రాజ్‌కు తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. పంజాతో టాలీవుడ్‌కు పరిచయమైనా.. మిర్చి సినిమాతో ఫేమస్ అయ్యారు. అనంతరం వరస ఆఫర్స్‌తో కెరీర్‌లో దూసుకుపోతున్నారు .
సంపత్ రాజ్‌తో విడాకుల అనంతరం.. శరణ్య మరో తమిళ నటుడు పొన్వన్నన్‌ను 1995లో పెళ్లి చేసుకున్నారు. తమిళ నటి అయిన శరణ్య తెలుగులో నీరాజనం వంటి సూపర్ హిట్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రాఖీ, జగడం, రెడీ, వేదం, కొమరం పులి, మనం వంటి అనేక సినిమాల్లో మంచి పాత్రల్లో నటించింది శరణ్య.
Also Read: కరోనా వైరస్ కు టీకా వేయించుకున్న తొలి బాలీవుడ్ నటిగా నిలిచిన మహేష్ బాబు వదిన