
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో రామ్ జగన్ ఒకరు. అటు సినిమాలు.. ఇటు సీరియల్స్ ద్వారా సినీప్రియులను అలరిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివంగత నటుడు అచ్యుత్ అకాల మరణంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అచ్యుత్ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించినా.. చిన్న వయసులోనే మరణించడం షాక్ కు గురిచేసిందని ఆయన తెలిపారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
నటుడు రామ్ జగన్ మాట్లాడుతూ.. తన స్నేహితుడు, దివంగత నటుడు అచ్యుత్ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. అచ్యుత్ ఎటువంటి దురలవాట్లు లేని మంచి వ్యక్తి అని, చిన్న వయసులోనే ఆయన మరణం అందరినీ కలచివేసిందని రామ్ జగన్ అన్నారు. పునీత్ రాజ్‌కుమార్, ఎ.వి.ఎస్. వంటి వారికి కూడా అనూహ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, జీవితం అనూహ్యమని, కర్మ సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని తెలిపారు. టీవీలో లభిస్తున్న మంచి పాత్రలు, నిరంతర పని, సంతృప్తికరమైన పారితోషికం కారణంగా తాను సినిమాలపై తక్కువ దృష్టి పెట్టానని వివరించారు. సినిమాపై తనకు ప్రేమ ఎప్పుడూ తగ్గలేదని, అయితే టీవీలో బిజీగా ఉండటం వల్ల సినిమాల్లో తక్కువ పాత్రలు చేశానని తెలిపారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
చిన్న వయసులోనే అచ్యుత్ మరణం సినీ వర్గాలను, ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసిందని గుర్తు చేసుకున్నారు. తిరుపతికి రైలులో వెళ్తుండగా అచ్యుత్ మరణవార్త తెలిసి, తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపి వెనక్కి వచ్చేశామని రామ్ జగన్ తెలిపారు. అచ్యుత్ అందరితోనూ ప్రేమగా ఉండేవాడని, అప్పుడే సినిమాలు, సీరియల్స్ చేసినట్లు తెలిపారు. అచ్యుత్ కు సిగరెట్లు, మద్యం వంటి అలవాట్లు లేవని, చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేవాడని.. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే చనిపోవడం ఇప్పటికీ షాక్ గానే ఉందని అన్నారు. పునీత్ రాజ్‌కుమార్, ఎ.వి.ఎస్. వంటి ఫిట్‌గా ఉన్న ప్రముఖులకు కూడా అనుకోని ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారని.. జీవితం అనూహ్యమైనదని, ఇది కర్మ సిద్ధాంతంపై తన నమ్మకాన్ని బలపరుస్తుందని అన్నారు. ప్రస్తుతం రామ్ జగన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..