Dhanya Ramkumar: సినీ ఇండస్ట్రీలోకి మరో వారసురాలు.. ప్రముఖ లెజండరీ నటుడి మనవరాలు హీరోయిన్‏గా ..

|

Jul 26, 2021 | 6:24 PM

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు మాత్రమే దూసుకుపోతున్నారు. కేవలం కొద్ది మంది వారసురాళ్లు మాత్రమే సినీ రంగ ప్రవేశం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు.

Dhanya Ramkumar: సినీ ఇండస్ట్రీలోకి మరో వారసురాలు.. ప్రముఖ లెజండరీ నటుడి మనవరాలు హీరోయిన్‏గా ..
Dhanya Ramkumar
Follow us on

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు మాత్రమే దూసుకుపోతున్నారు. కేవలం కొద్ది మంది వారసురాళ్లు మాత్రమే సినీ రంగ ప్రవేశం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు. అటు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు సెలబ్రెటీల కూతుర్లు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినవారు చాలా తక్కువ. అయితే ఈ మధ్య వారుసురాళ్లు సైతం సినీ రంగ ప్రవేశం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ లెజండరీ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ మనవరాలు ధన్య రామ్ కుమార్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం.

కన్నడ చిత్రపరిశ్రమలో డాక్టర్ రాజ్ కుమార్‏కు ప్రత్యేక స్థానం ఉంది. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకు‏లను అలరించారు రాజ్ కుమార్. తాజాగా ఆయన మనవరాలు ధన్యరామ్ కుమార్ హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిన్నా సానిహకే అనే కన్నడ సినిమాలో నటించింది ధన్య. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ధన్య తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు ధన్యతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ధన్య రామ్ కుమార్.. పూర్ణిమ రాజ్ కుమార్, రామ్ కుమార్‏ల కూతురు. ఇప్పటికే లెజెండరీ నటుడు రాజ్ కుమార్ కుమారులు.. శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్‏లు కన్నడ సినీ పరిశ్రమలో రాణిస్తుండగా.. తాజాగా ఆయన మనవరాలు ధన్య హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

Also Read: Healthy Breakfast: ఉదయాన్నే పెరుగు, అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలు.. బరువు తగ్గించే సూపర్ ఫుడ్..

Fresh Fish: మార్కెట్‌లో దొరికే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోండి!

Mutual Funds: నిర్ధిష్ట లక్ష్యం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్ బెటర్.. వీటి గురించి తెలుసుకోండి..

Karnataka CM: కర్ణాటకలో ఊహించిందే జరిగింది.. సీఎం యడ్డీయూరప్ప రాజీనామా.. ఇక, కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే..?