Actor Narsing Yadav : నర్సింగ్ యాదవ్‌‌‌‌‌‌‌‌ది చిన్నపిల్లాడి మనస్తత్వం.. చివరి కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు..

తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు నర్సింగ్ యాదవ్.. అనారోగ్య కారణం వల్ల నర్సింగ్ యాదవ్ గత ఏడాది డిసెంబర్ 31న కన్నుమూశారు...

Actor Narsing Yadav : నర్సింగ్ యాదవ్‌‌‌‌‌‌‌‌ది చిన్నపిల్లాడి మనస్తత్వం.. చివరి కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు..

Updated on: Jan 19, 2021 | 1:41 AM

Actor Narsing Yadav : తన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు నర్సింగ్ యాదవ్.. అనారోగ్య కారణం వల్ల నర్సింగ్ యాదవ్ గత ఏడాది డిసెంబర్ 31న కన్నుమూశారు. విలన్ గా భయపెడుతూనే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించారు నర్సింగ్ యాదవ్. ఆయన అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపోవడంతో సినీలోకం దిగ్బ్రాంతికి  గురైంది.  ఇటీవల ఓ ఇన్టర్వ్యులో నర్సింగ్ యాదవ్ సతీమణి చిత్ర నర్సింగ్ యాదవ్ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

ఆమె మాట్లాడుతూ.. నర్సింగ్ యాదవ్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం. చిత్ర చిత్ర అంటూ రోజుకు లక్షసార్లు పిలిచేవారు. నేనంటే నర్సింగ్ కు పంచ ప్రాణాలు. నర్సింగ్ ఎప్పుడూ కూడా ఒక మాట చెబుతుండేవారు. నేను అనారోగ్యంతో మంచాన పడకూడదు. నటిస్తూనే చచ్చిపోవాలి అనేవారు. ఆఖరి రోజుల్లో కూడా నటించాలని ఎంతో తాపత్రయపడ్డారు. ఆరోగ్యం నయమైతే నటించాలని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఆర్జీవి వెబ్ సిరీస్ పోస్టర్ రిలీజ్.. ‘ఇది మహాభారతం కాదు.. కానీ అలాంటి పాత్రలే’ అంటూ..

heroine Rakulpreet singh: ‘నీ పని అయిపోయింది.. ఇక నీకు అవకాశాలు రావన్నారు’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన రకుల్..