Prabhas: మనసు మార్చుకున్న ప్రభాస్‌.. ఆ సినిమా కంటే ముందే..

ఇదిలా ఉంటే ఓవైపు పరాజయాలు ఎదురైనా ప్రభాస్‌ సినిమాలు మాత్రం ఎక్కడా ఆగలేవు. ఆయన మార్కెట్‌ను క్యాష్‌ చేసుకోవడానికి నిర్మాతలు సినిమాలను పట్టాలెక్కిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే నాగ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ, రాజా సాబ్‌‌, స్పిరిట్‌ వంటి చిత్రాలు ఇప్పటికే క్యూలో ఉన్నాయి. అయితే...

Prabhas: మనసు మార్చుకున్న ప్రభాస్‌.. ఆ సినిమా కంటే ముందే..
Prabhas

Updated on: Feb 13, 2024 | 7:13 AM

సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ వంటి మూడు పరాజయాల తర్వాత ఒక్కసారిగా.. సలార్‌ రూపంలో భారీ విజయాన్ని అందుకున్నారు హీరో ప్రభాస్‌. ఈ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద తన పంజా విసిరారు. తన పవర్‌ ఏంటో మరోసారి ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి రుచి చూపించాడు. ప్రశాంత్‌ నీల్‌ మార్క్‌ దర్శకత్వం, ప్రభాస్‌ స్టైల్‌ ఆప్‌ యాక్షన్‌ సినిమాను విజయతీరాలకు చేర్చాయి.

ఇదిలా ఉంటే ఓవైపు పరాజయాలు ఎదురైనా ప్రభాస్‌ సినిమాలు మాత్రం ఎక్కడా ఆగలేవు. ఆయన మార్కెట్‌ను క్యాష్‌ చేసుకోవడానికి నిర్మాతలు సినిమాలను పట్టాలెక్కిస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే నాగ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ, రాజా సాబ్‌‌, స్పిరిట్‌ వంటి చిత్రాలు ఇప్పటికే క్యూలో ఉన్నాయి. అయితే సలార్ మొదటి పార్ట్‌ విడుదల ప్రభాస్‌ మరో చిత్రాన్న పూర్తి చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీని పూర్తి చేయాలని ప్రభాస్‌ తొలుత భావించారు.

కానీ సలార్‌ మూవీకి వచ్చిన అనూహ్య స్పందని చూసిన తర్వాత సలార్‌ రెండో భాగాన్ని కూడా త్వరగా విడుదల చేయాలని ప్రశాంత్‌ నీల్ భావిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే ప్రభాస్‌ సైతం సినిమా లైనప్‌ల విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సలార్‌ 2 చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత స్పిరిట్‌ను మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పప్రస్తుతం ఎలాగో కల్కి, రాజా సాబ్‌ సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఒకేసారి నటిస్తోన్న ప్రభాస్‌.. స్పిరిట్‌కు మాత్రం కాస్త గ్యాప్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తొలుత సలార్‌ 2 పూర్తి చేయాలన్న ప్రతిపాదనకు ప్రభాస్‌ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌, సలార్‌ 2 సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించి శరవేగంగా పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం కల్కి చిత్ర షూటింగ్‌ చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తికాగానే సలార్‌2ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నరాని సమాచార. దీంతో వచ్చే ఏడాది సమ్మర్‌ నాటికి సలార్‌2 ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..