AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: తగ్గేదేలే అంటోన్న సామ్‌.. మరో కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌, ఆ హీరోతో నాలుగోసారి..

Samantha: ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత పేరు మాగుమోగుతోంది. మొన్నటి వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో నిత్యం వార్తలో నిలిచిన సామ్‌ ఇప్పుడు సినిమాలతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది...

Samantha: తగ్గేదేలే అంటోన్న సామ్‌.. మరో కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌, ఆ హీరోతో నాలుగోసారి..
Narender Vaitla
|

Updated on: Jun 04, 2022 | 8:28 AM

Share

Samantha: ప్రస్తుతం ఇండస్ట్రీలో సమంత పేరు మాగుమోగుతోంది. మొన్నటి వరకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో నిత్యం వార్తలో నిలిచిన సామ్‌ ఇప్పుడు సినిమాలతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. వివాహం తర్వాత చాలా రోజుల పాటు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వచ్చిన సామ్‌.. వివాహబంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత జోష్‌ పెంచేసింది. పుష్ప (Pushp) సినిమాలో ‘ఊ అంటావా’ అంటూ కుర్రకారును మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. వరుస పెట్టి సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే శాకుంతలం, యశోద, ఖుషి ఇలా ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉందీ బ్యూటీ.

ఈ మూడింటిలో ఇంకా ఒక్క సినిమా విడుదలవకముందే సామ్‌ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల నయనతార, విజయ్‌సేతుపతి నటించిన ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాతో తమిళంలో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్‌లో మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ 67వ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చిత్ర యూనిట్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సామ్‌ కూడా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సామ్‌ అయితే బెస్ట్‌ అని మేకర్స్‌ భావిస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది.

Vijay Sam

ఇదిలా ఉంటే ఉంటే ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే విజయ్‌, సామ్‌లు కలిసి నటిస్తోన్న నాలుగో సినిమా అవుతుంది. వీరిద్దరు ఇప్పటికే ‘కత్తి, తేరి, మెర్సల్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. మరి విజయ్‌తో సామ్‌ మరోసారి జతకట్టనుందని జరుగుతోన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు