పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్‌తో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వీటితో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు ప్రభాస్. మొదట్లో ఈ కాంబినేషన్‌పై చాలా వరకు నీలి మేఘాలు కమ్ముకున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన రావడంతో ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యింది. పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ తొలిసారి ఒక హారర్ అండ్ కామెడీ కాన్సెప్ట్ మూవీలో నటించనున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమై అప్‌డేట్ నెట్టింట సందడి చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు బుధవారం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ప్రభాస్ ఫుల్ టైమ్‌లో నటించడం ఇదే తొలి రోజు కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ భారీ భూత్ బంగ్లాను సెట్ వేశారని తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీగా వేసిన సెట్‌లో ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొన్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిస్తోంది.
ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి కోసం వారం రోజులపాటు కాల్షిట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..