Pawan Kalyan: మరోసారి ఖాకీ డ్రస్‌ వేయనున్న పవర్ స్టార్‌.. తమిళ సూపర్‌ హిట్‌ రీమేక్‌తో.?

Pawan Kalyan: కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కమ్‌బ్యాక్‌ చిత్రం 'వకీల్‌సాబ్‌'తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం వచ్చిన భీమ్లా నాయక్‌ కూడా...

Pawan Kalyan: మరోసారి ఖాకీ డ్రస్‌ వేయనున్న పవర్ స్టార్‌.. తమిళ సూపర్‌ హిట్‌ రీమేక్‌తో.?
Pawan Kalyan

Updated on: Apr 27, 2022 | 9:16 AM

Pawan Kalyan: కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కమ్‌బ్యాక్‌ చిత్రం ‘వకీల్‌సాబ్‌’తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం వచ్చిన భీమ్లా నాయక్‌ కూడా మంచి విజయాన్ని అందుకుంది. కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్‌ ఆ గ్యాప్‌ను భర్తీ చేసేందుకుగాను వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’, హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే గబ్బర్‌ సింగ్‌, కొమరం పులి, భీమ్లానాయక్‌ వంటి చిత్రాల్లో పోలీస్‌ పాత్రలో నటించి అభిమానులను మెప్పించిన పవన్‌ మరోసారి ఖాకీ డ్రస్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్‌ చిత్రం ‘తేరి’ సినిమా రీమేక్‌కు పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్‌, సమంత జోడిగా నటించిన ఈ సినిమాను తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే కథపై ఉన్న నమ్మకంతో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు సాహో ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహించనున్నాడని కూడా చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ వార్త తెలిసిన పవన్‌ అభిమానులు, తమ అభిమాన హీరోను మరోసారి పోలీస్‌ గెటప్‌లో చూడొచ్చని ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Andhra Pradesh: హాల్ టిక్కెట్ చూపిస్తే “ఫ్రీ”గా ప్రయాణం.. విద్యార్థుల కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం

Kamala Harris: అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారీస్‌కు కరోనా పాజిటివ్.. వైట్‌హౌస్ అలర్ట్..

Viral Video: రైతన్నా.. నీ ఆలోచన అదుర్స్ అంటోన్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.. వైరలవుతోన్న వీడియో..