AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రైతన్నా.. నీ ఆలోచన అదుర్స్ అంటోన్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.. వైరలవుతోన్న వీడియో..

ఇలాంటి పరిస్థితుల్లో వేసిన పంటలను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. కొంతమంది రైతులు పొలాల్లో మనుషులు లేదా జంతువుల దిష్టిబొమ్మలను ఉంచడంత ద్వారా.. పంటలను నాశనం చేసే జీవులు పొలాల్లోకి రాకుండా చేస్తున్నారు.

Viral Video: రైతన్నా.. నీ ఆలోచన అదుర్స్ అంటోన్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే మీరు కూడా.. వైరలవుతోన్న వీడియో..
Amazing Jugaad Vide
Venkata Chari
|

Updated on: Apr 27, 2022 | 6:30 AM

Share

వ్యవసాయం చేయడం చాలా కష్టమైన పని. ఓవైపు నష్టాలు, మరోవైపు పక్షులు, కోతుల బెడదతో చాలామంది రైతులు నానాకష్టాలు పడుతున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడం మరింత కష్టంగా మారింది. ఈరోజుల్లో ప్రతి గ్రామంలోనూ నీలగైల బెడద పెరిగిపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. వీటికితోడు కీటకాల భయం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వేసిన పంటలను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. కొంతమంది రైతులు పొలాల్లో మనుషులు లేదా జంతువుల దిష్టిబొమ్మలను ఉంచడంత ద్వారా.. పంటలను నాశనం చేసే జీవులు పొలాల్లోకి రాకుండా చేస్తున్నారు. మరికొందరు రైతులు వివిధ రకాల పరికరాలను కూడా కొనుగోలు చేస్తూ, తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే, కొంతమంది రైతులు ‘ దేశీ జుగాడ్ ‘(Desi Jugaad Video) వంటి విభిన్న పరికరాలు చేసి, ఆకట్టుకుంటున్నారు. అలాంటి జుగాడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్(Viral) అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా రైతును మెచ్చుకుంటారు.

పొలంలో వెదురును ఉపయోగించి రైతు ఎలా సెటప్‌ను సిద్ధం చేశాడో వీడియోలో మీరు చూడొచ్చు. ఈ సెటప్‌లో అతను ఒక వైపు వెదురుతో భారీ ఇనుప పలకను కట్టాడు. మరోవైపు వెదురును నీటితో నింపాడు. వెదురు ముందు భాగంలో నీటితో నిండిన వెంటనే, అది మరొక వైపునకు కిందకు పడిపోయి, దానిలోని బంతి ఇనుప ప్లేట్‌ని గట్టిగా తాకుతుంది. పెద్ద శబ్దం వచ్చే విధంగా ఉంది. ఈ శబ్ధం ఎంత పెద్దదంటే పొలంలో కూర్చున్న పక్షులు శబ్దం వినగానే పారిపోతున్నాయి. ఈ శబ్దం నిరంతరం రావడంతో ఏ పక్షి కూడా పొలానికి రావడానికి సాహసించదు. పొలం నుంచి పక్షులను తరిమికొట్టడానికి రైతు చేసిన ఈ ప్రత్యేకమైన విధానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ అద్భుతమైన దేశీ జుగాడ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అవకాడోటెక్నాలజీ పేరుతో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. 4 లక్షల 37 వేల మందికి పైగా ఈ వీడియోను ఇష్టపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:  Ola Electric Scooter: లక్షలు పోసి కొన్న స్కూటర్ ను తగలబెట్టిన ఓనర్.. అలా ఎందుకు చేశాడంటే..

British Woman: ఆమె వయసు99.. ఏకంగా యుద్ద విమానాన్నే నడిపింది..!