Girls Fighting: బాబోయ్ మరీ ఇలా ఉన్నారేంట్రా.. విద్యార్థినుల గ్యాంగ్ వార్.. చూస్తే గుండెలదరాల్సిందే..!
Girls Fighting: చెన్నైలో ఇటీవల లవర్ కోసం యువతులు కొట్టుకున్న విషయం మరువకముందే మరో విద్యార్థినుల గ్యాంగ్ వార్ వెలుగులోకి వచ్చింది.

Girls Fighting: చెన్నైలో ఇటీవల లవర్ కోసం యువతులు కొట్టుకున్న విషయం మరువకముందే మరో విద్యార్థినుల గ్యాంగ్ వార్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి లవర్ కోసం కాకుండా కాలేజీలో కూర్చునే రో కోసం కొట్టుకున్నారు. కొట్టుకోవడం అంటే అలా ఇలా కాదు.. వీర కుమ్ముడు కుమ్ముకున్నారు కాలేజీ యువతులు. గ్యాంగ్‌వార్లు మగవాళ్లకే సొంతమా అనుకున్నారేమో ఆ యువతులు రోడ్డుమీద అందరూ చూస్తుండగానే జుట్లు పట్టి కొట్టుకున్నారు.
చెన్నైలో స్థానికంగా ఉన్న ఓ బస్టాండ్ వద్ద ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ లో రెండు గ్రూప్స్ మధ్య చెలరేగిన వివాదం షికలు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లింది. క్లాస్ రూంలో కూర్చునే రో కోసం యువతులు కొట్టుకున్నట్టు తెలుస్తుంది. పోలీసులు, స్థానికులు వచ్చి వారించినా పట్టుకున్న జుట్టు విడవకుండా తన్నుకున్నారు.
కాలేజీ అమ్మాయిలంటే బుద్ధిగా క్లాసులకు వెళ్లి.. తిరిగి ఇంటికి రావాలి. కానీ ఇక్కడ వీళ్లు మాత్రం జుట్టు, జుట్టు పట్టుకుని కొట్టుకోవడం సంచలనంగా మారింది. పక్కన వాళ్లు విడిపిస్తున్నా ఆగకుండా.. నడిరోడ్డు మీదే చెడా మడా కొట్టుకున్నారు. వీళ్లకేమీ గట్టు పంచయతీలు లేవు.. ఇంటి దగ్గర తగాదాలు అంతకంటే కాదు. కేవలం కూర్చునే రో కోసం ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also read:
Viral Video: వ్యాన్‌కు వేలాడుతూ పాము షికారు.. వీడియో చూస్తూ ఫ్యూజులు ఔట్..!
Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..
Andhra Pradesh: అనిల్ ఇంటికి వెళ్లిన మంత్రి కాకాని.. కలిసిన చేతులు.. కలవని చూపులు..!