Tollywood: అభిమానులకు పండగలాంటి వార్త.. ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలు..

Tollywood: నందమూరి అభిమానులు త్వరలోనే శుభవార్త విననున్నారని తెలుస్తోంది. బాబాయ్‌, అబ్బాయ్‌లు ఒకే వేదికను పంచుకోనున్నారని సమచారం. ఇంతకీ విషయేమంటంటే..

Tollywood: అభిమానులకు పండగలాంటి వార్త.. ఒకే వేదికపై ముగ్గురు నందమూరి హీరోలు..

Updated on: Jul 13, 2022 | 9:59 AM

Tollywood: నందమూరి అభిమానులు త్వరలోనే శుభవార్త విననున్నారని తెలుస్తోంది. బాబాయ్‌, అబ్బాయ్‌లు ఒకే వేదికను పంచుకోనున్నారని సమచారం. ఇంతకీ విషయేమంటంటే.. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటిస్తోన్న తాజా చిత్రం బింబిసార. హిస్టారికల్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. వశిష్ట్‌ మల్లిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేథరిన్‌ థెస్రా, సంయుక్త మీనన్‌ నటిస్తున్నారు. మ‌గ‌ధ సామ్రాజ్యాధినేత బింబిసారుడుకు ఈ త‌రం జ‌న‌రేష‌న్‌లో మరో వ్యక్తికి లింక్‌ చేస్తున్నట్లు కథాంశం ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ భారీగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించాలని చూస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ భారీ బ‌డ్జెట్‌తో స్వయంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్‌తో పాటు నట సింహం బాలకృష్ణ హాజరుకానున్నారని సమాచారం.

కళ్యాణ్‌ రామ్‌ గతంలో నటించిన పటాస్‌ సినిమాకు కూడా ఇలానే ప్రచారం చేశారు. ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. నందమూరి హీరోలు ముగ్గురు కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారనే వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..