టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు తాజా షూటింగ్ ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర శివారులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలోనే శనివారం షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సంపూర్ణేష్ బాబు బజార్ రౌడీ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ నగర శివారులో జరుగుతోంది. ఇందులో భాగంగా.. సంపూర్ణేష్ బైక్ను పైకి లేపి సంచుల మధ్య నుంచి కిందకు దూకాలి. ఇక ఆ సన్నివేశం జరుగుతుండగా.. బైక్ పై నుంచి సంపూర్ణేష్ బాబు కిందపడిపోయాడు. తాడుతో బైక్ను దింపుతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్.. అక్కడకు వెళ్ళి సంపూని లేపారు. హృదయ కాలేయంతో సంపూర్ణేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సింగం 123, కొబ్బరిమట్ట లాంటి సినిమాల్లో నటించాడు.
Also Read:
Regina Cassandra : నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా.. సినీ జర్నీ పై హీరోయిన్ రెజీనా..