మరో కొత్త సినిమాతో రాబోతున్న హీరో ఆది.. ఆసక్తికరంగా కనిపిస్తున్న ‘బ్లాక్’ ఫస్ట్ లుక్ పోస్టర్..

'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు సాయికుమారు తనయుడు ఆది సాయి కుమార్. తర్వాత ఒకటి రెండు సినిమాలు తీసి కాస్తా సైలెంట్ అయ్యాడు

  • Rajitha Chanti
  • Publish Date - 6:35 pm, Wed, 23 December 20
మరో కొత్త సినిమాతో రాబోతున్న హీరో ఆది.. ఆసక్తికరంగా కనిపిస్తున్న 'బ్లాక్' ఫస్ట్ లుక్ పోస్టర్..

‘ప్రేమ కావాలి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు సాయికుమారు తనయుడు ఆది సాయి కుమార్. తర్వాత ఒకటి రెండు సినిమాలు తీసి కాస్తా సైలెంట్ అయ్యాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఆది శశి సినిమాలో నటిస్తున్నాడు. కాగా అటు మరో కొత్త సినిమాకు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మహాంకాళి మూవీస్ బ్యానర్‏పై మహాంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ అనే టైటిల్‏ను ఖారారు చేసింది చిత్రబృందం. అయితే డిసెంబర్ 23న ఆది పుట్టిన రోజు కావడంతో ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

ఈ చిత్రంలో ఆది పోలీస్ ఆఫీసర్‏గా నటిస్తున్నాడు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‏గా ఈ చిత్రం రాబోతుంది. ఇందులో ఆది సరసన దర్శన బానిక్ నటిస్తుంది. కాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలావరకు లాక్‏డౌన్ కంటే ముందే పూర్తైంది. ఈ సినిమాకు సురేషన్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆమని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.