Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఫిదా చేసిన వీరాభిమాని.. అతను కోరడమే ఆలస్యం..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగిన విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఫిదా చేసిన వీరాభిమాని.. అతను కోరడమే ఆలస్యం..
Chiranjeevi

Updated on: Aug 27, 2021 | 5:23 PM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగిన విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని చిరుకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తిరుపతికి చెందిన ఓ వీరాభిమాని అలిపి నుంచి హైదరాబాద్‌కు సైకిల్ యాత్ర చేపట్టాడు. దాదాపు 12 రోజులు ప్రయాణించి హైదరాబాద్‌ చేరుకున్న ఆ అభిమాని చిరుకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అభిమాని సాహసం గురించి తెలుసుకున్న చిరంజీవి.. ఆశ్చర్యపోయారు. తనను కలిసేందుకు అభిమానికి అంత శక్తి ఎలా వచ్చిందో అంటూ ఆశ్చర్యపోతూనే.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటూ తన అభిమానులను వారించారు మెగాస్టార్ చిరంజీవి.

తన అభిమానిని కలిసిన చిరంజీవి అతనిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నా అభిమాని ఎన్. ఈశ్వర‌య్య బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి (అలిపిరి) నుంచి అత‌డు సైకిల్ పై ప్రయాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌రోజు సందర్భంగా విష్ చేయడం కోసం అత‌డు సైకిల్ యాత్ర చేప‌ట్టి వ‌చ్చి క‌లవడం నాకు ఆశ్చర్యమేసింది. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వ‌చ్చాడు ఈ అభిమాని. చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ, ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మ‌న‌సు, ఆశీస్సులతోనే మేం బాగుంటాం. వారు మా గురించి ఆలోచించిన‌ట్లే మేం కూడా వారు, వారి కుటుంబ స‌భ్యులు బాగుండాల‌ని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాను.’’ అని అన్నారు. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌ల‌వాల‌ని అడిగిన ఆ అభిమానికి.. అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో ఆ వీరాభిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కూడా కలిశాడు. ఇద్దరు మెగా హీరోలను కలవడంతో ఆ అభిమాని ఈశ్వరయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన జన్మ ధన్యమైందంటూ ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. పన్నెండు రోజుల సైకిల్ ప్రయాణాన్ని.. వీరిని కలిసిన ఒక్కరోజులో మర్చిపోయేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆ వీరాభిమాని.

Also read:

Afghanistan Crisis: కాబుల్ విమానాశ్రయంలో పెలుళ్లు.. 110 కి చేరిన మృతుల సంఖ్య..

Dalitha Bandhu: నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా.. దళితబంధుపై సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్..

Telangana News: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఆవులను దొంగిలించి ఆపై జింక మాంసం అంటూ..