బిగ్‌బీ నాలుగు బంగ్లాలను సీల్‌ చేసిన అధికారులు

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అమితాబ్‌, అభిషేక్, ఐశ్వర్య, ఆద్యలకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బిగ్‌బీ నాలుగు బంగ్లాలను సీల్‌ చేసిన అధికారులు

Edited By:

Updated on: Jul 12, 2020 | 8:27 PM

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అమితాబ్‌, అభిషేక్, ఐశ్వర్య, ఆద్యలకు కరోనా పాజిటివ్‌గా తేలగా.. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బిగ్‌బీ కుటుంబానికి చెందిన నాలుగు బంగ్లాలను అధికారులు సీల్ చేశారు. ముంబయిలో జల్సా, ప్రతీక్ష, జనక్, వత్సా భవనాలను సీల్‌ చేసిన అధికారులు వాటిని శానిటైజ్ చేశారు. ఇక ఈ బంగ్లాలలో మొత్తం 30 మంది సిబ్బంది పని చేస్తుండగా.. వారికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు రావాల్సి ఉందని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు కరోనా నుంచి బిగ్‌బీ కుటుంబం త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీలు మొదలు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ,