West Bengal Election 2021: నందిగ్రామ్‌ నీదా..నాదా..? సై అంటే సై అంటున్న ఉద్దండులు.. ఈ కథేంటో ఓ సారి చూద్దాం..!

|

Mar 30, 2021 | 1:31 PM

అక్కడ సువేందు అధికారి, మమతా బెనర్జీ..చావో రేవో తేల్చుకుంటామంటున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. సువేందు వెన్నుపోటుదారుడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు మమత...

West Bengal Election 2021: నందిగ్రామ్‌ నీదా..నాదా..? సై అంటే సై అంటున్న ఉద్దండులు.. ఈ కథేంటో ఓ సారి చూద్దాం..!
Suvendu Adhikari Vs Cm Mama
Follow us on

నందిగ్రామ్‌ నీదా..నాదా..? సై అంటే సై అంటున్నారు మమత, సువేందు. ఇద్దరి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఐతే సాయంత్రం 5 గంటలకు అక్కడ మైకులు మూగబోనున్నాయి. బెంగాల్‌ దంగల్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఏప్రిల్‌ 1న 39 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వాటిలో నందిగ్రామ్‌ హాట్‌ సీటుగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తైతే..నందిగ్రామ్‌ ఒక్కటే మరో ఎత్తు.

అక్కడ సువేందు అధికారి, మమతా బెనర్జీ..చావో రేవో తేల్చుకుంటామంటున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో క్యాంపెయిన్‌ చేస్తున్నారు. సువేందు వెన్నుపోటుదారుడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు మమత. నమ్మకద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పేందుకే నందిగ్రామ్‌ నుంచి బరి లోకి దిగినట్టు తెలిపారు.

ఐతే ముఖ్యమంత్రి మమతపైన అదేస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు సువేందు. నందిగ్రామ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇవాళ నందిగ్రామ్‌లో చివరిరోజు సువేందుకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు అమిత్‌షా. మమతకు పోటీగా నాలుగు రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. ఇటు దీదీ కూడా ఇవాళ వరుసగా నాలుగు రోడ్‌షోలు నిర్వహించనున్నారు. కాలికి గాయంతో వీల్‌ఛైర్‌లోనే యాత్ర చేస్తున్నారు. దీంతో పోటాపోటీ క్యాంపెయిన్‌లతో చివరిరోజు ప్రచారం ఉత్కంఠ రేపుతోంది.

మరి నందిగ్రామ్‌లో దశాబ్ధాలుగా హవా కొనసాగిస్తున్న సువేందు గెలుస్తారా..? లేక ముఖ్యమంత్రి మమత తన పంతం నెగ్గించుకుంటారా..? నందిగ్రామ్‌ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల‌లో ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మ‌ల్టీలెవ‌ల్ కార్ పా‌ర్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..

Sultan of Multan: ముల్తాన్ కా సుల్తాన్‌.. పాకిస్తాన్‌కు చెప్పి మరీ కొట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు మూడు సెంచరీలు..

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?