లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మే13వ తేదీన (సోమవారం) జరగనున్న ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు ప్రారంభించారు. అటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. 4వ విడుదలో 10 రాష్ట్రాల్లోని 96 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరనుండగా. ఏపీలో 175 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో పోలీసులు సైతం అన్ని పటిష్ట చర్యలను చేపట్టారు. ఇప్పటికే 144 సెక్షన్ అమలుతో పాటు, మద్యం దుకాణాలను మూసివేశారు. ఇక ఇదిలా ఉంటే పోలింగ్‌కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో పోలింగ్ స్టేషన్‌కు మొబైల్ ఫోన్‌ను తీసుకొళ్లొచ్చా.? లేదా.? అన్న సందేహం ఒకటి. ఇటీవల సెల్ఫీ డ్రెండ్ పెరిగింది.
చాలా మంది ఓటు వేసిన తర్వాత వేలిపై ఉండే ఇంకును చూపిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మేం ఓటు వేశాం, మీరు కూడా వేయండి అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఇది బాగానే ఉన్నా. స్మార్ట్ ఫోన్‌లను ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఒకవేళ ఎవరైనా పొరపాటున స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చినా స్విచ్ఛాఫ్ చేసి భద్రతా సిబ్బంది లేదా పోలింగ్ సిబ్బంది లేదా బీఎల్‌ఓ వద్ద ఇవ్వాల్సి ఉంటుంది.
ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ బూత్‌లోకి స్మార్ట్ ఫోన్‌తో పాటు కెమెరాలాంటి వాటిని అనుమతించరు. కాగా చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం ఈసీ డిజటల్ ఓటర్ స్లిప్పులను తీసుకొచ్చింది. ఓటర్ స్లిప్పుల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. దీన్ని స్కాన్ చేయడం వల్ల మన పోలింగ్ కేంద్రం వివరాలు తెలుస్తాయి. పోలింగ్ కేంద్రానికి వెళ్లాలో రూట్ కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది.
మరిన్ని ఎన్నికల సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి..