తమిళనాడులో సహజంగానే ఓటర్లు ఈ సారి స్టాలిన్ నేతృత్వం లోని డీఎంకే కి అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో డీఎంకే 103 చోట్ల ఆధిక్యంలో ఉంది, నటుడు, రాజకీయనేత,మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సౌత్ కోయంబత్తూరులో ఆధిక్యంలో ఉన్నారు. తన సమీప బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ పై ఆయన 45 కి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కమల్ హాసన్ ఆదివారం ఉదయం ఈ నియోజకవర్గాన్ని విజిట్ చేసి కౌంటింగ్ ట్రెండ్ తెలుసుకున్నారు. ఇక ఎడప్పాడులో సీఎం పళనిస్వామి, బోడినాయకనూర్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఆధిక్యంలో ఉన్నారు. చెన్నై అన్నా నగర్ వాసులు డీఎంకే కె పట్టం కట్టారు. ఈ నియోజకవర్గాన్ని తామే గెలుచుకుంటామని అన్నా డీఎంకే కొండంత ఆశతో ఉన్నా అది ఫలించలేదు.
మరిన్ని చదవండి ఇక్కడ : ఉత్కంఠ రేపుతున్న ఓట్ల లెక్కింపు.. గెలిచేదెవరు? మరికాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం:5 States Assembly Election Results 2021 Live Video.