5 రాష్ట్రాల్లో ఈ నెల 7 న జరిగిన ఎన్నికల తాలూకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్,రాష్ట్రాలతో బాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో అస్సాం రాష్ట్రానికి మూడు దశల్లో ఎన్నికలు జరగగా, బెంగాల్ కి ఎనిమిది దశల్లో జరిగాయి. మిగతా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతానికి ఒకే దశలో ఎన్నికలను నిర్వహించారు. తమిళనాడులో ముఖ్యంగా సీఎం, అన్నా డీఎంకే నేత పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్ భవితవ్యాలు ఇక త్వరలో తేలనున్నాయి. ఈ పార్టీల మధ్యే పోటీ బలంగా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే, ఇతర పార్టీలకు పురుషులు, మహిళలు వేసిన ఓట్లు, అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, ఇతరులు వేసిన ఓట్లు, వాటి శాతాలు స్పష్టమయ్యాయి. టీవీ9 ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం పురుషుల్లో 45.10 శాతం మంది డీఎంకే వైపే మొగ్గు చూపగా, 36.70 శాతం మంది అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపారు. ఇతర పార్టీలు 18.20 శాతం మంది ఓట్లను .దక్కించు కోగలిగాయి. (100 శాతం) ఇక మహిళల్లో డీఎంకేకి 44.70 శాతం, అన్నా డీఎంకేకి 37 శాతం, ఇతర పార్టీలకు 18.30 శాతం ఓటు వేశారు. (ఇది కూడా మొత్తం 100 శాతం).మొత్తం డీఎంకేకి 44.90 శాతం, అన్నాడీఎంకేకి 36.80, ఇతరులకు 18.30 శాతం ఓట్లు లభించాయి.
మతం,కులం వారీగా చూస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలు డీఎంకేకి 46.70 శాతం, ఏఐ ఏడీఎంకి 36.49 శాతం, ఇతర పార్టీలకు 16.90 శాతం ఓటు వేశారు. ముస్లింలు డీఎంకేకి 59.2 శాతం, అన్నా డీఎంకే కి 16.20 శాతం, ఇతరులకు 24. 60 శాతం ఓటు వేశారు. టోటల్ 100.10 శాతం ఉంది.ఇతరులు డీఎంకేకి 40.30 శాతం, అన్నాడీఎంకేకి 39, ఇతరులకు 20.80 శాతం ఓట్లు వేశారు. మొత్తం డీఎంకేకి 44.90 శాతం, అన్నాడీఎంకేకి 36.80, ఇతరులకు 18.30 శాతం ఓటు వేశారు.
..అంచనా..సీట్ల పరంగా చూస్తే డీఎంకేకి 143 నుంచి 153 వరకు, అన్నాడీఎంకేకి 75 నుంచి 85 వరకు, ఇతరులకు 2 నుంచి 12 వరకు లభించవచ్చు. రాష్ట్ర అసెంబ్లీలో 234 .సీట్లు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: West Bengal Exit Poll Results 2021 LIVE:: ఉత్తరాధిన పాగా వేసేది ఎవరు..? పశ్చిమ బెంగాల్ , అస్సాం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్