Actor Mansoor Ali Khan Campaign : నటుడు మన్సూర్ అలీ ఖాన్ చిత్రాతిచిత్రాలు, విభిన్న శైలిలో తమిళనాట ఎన్నికల ప్రచారం

Actor Mansoor Ali Khan Campaign : తమిళనాట తారాగణానికి లోటేముంది.. అంతేనా.. కోలీవుడ్ కి పాలిటిక్స్ కి విడదీయరాని బంధం పెనవేసుకుందక్కడ...

Actor Mansoor Ali Khan Campaign : నటుడు మన్సూర్ అలీ ఖాన్ చిత్రాతిచిత్రాలు, విభిన్న శైలిలో తమిళనాట ఎన్నికల ప్రచారం
Munsoor Ali Khan

Updated on: Mar 27, 2021 | 5:11 PM

Actor Mansoor Ali Khan Campaign : తమిళనాట తారాగణానికి లోటేముంది.. అంతేనా.. కోలీవుడ్ కి పాలిటిక్స్ కి విడదీయరాని బంధం పెనవేసుకుందక్కడ. ఎన్నికేదైనా తారల తళుకులు అచ్చోట షరా మామూలే. అయితే, ఇప్పుడు సాక్షాత్తూ అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఇక విషయం పీక్స్ లో ఉంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సినీ హీరోలు, హీరోయిన్లు, యాక్టర్లు ప్రచారంలో మునిగితేలుతున్నారు. వివిధ ప్రముఖ రాజకీయ పార్టీలకు మద్దతుగా కొందరు ప్రచారం నిర్వహిస్తుంటే, కొందరు సరాసరి ఎన్నికల రంగంలోకి దిగి పార్టీలు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇక తోండముత్తూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన మరో నటుడు మన్సూర్ అలీ ఖాన్ విభిన్న శైలిలో తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలే చెత్తకుండీల పక్కన, కుక్కలతో పాటు కూర్చుని వెరైటీ క్యాంపెయిన్ చేస్తే, ఇవాళ మరో వెరైటీ టర్న్ తీసుకున్నారు మన్సూర్. పెళ్లిలో డ్యాన్సులు చేస్తూ, గ్రౌండ్ లో క్రికెట్ అడుతూ ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు మన్సూర్ అలీఖాన్.